Advertisement

రియల్ మీ సీ3ఐ స్మార్ట్ ఫోన్ లాంచ్

By: chandrasekar Mon, 29 June 2020 10:49 AM

రియల్ మీ సీ3ఐ స్మార్ట్ ఫోన్ లాంచ్


రియల్ మీ కంపెనీ మరో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదల చేశారు. రియల్ మీ సీ3ఐ స్మార్ట్ ఫోన్ వియత్నాంలో లాంచ్ అయింది. ఇది రియల్ మీ సీ3 రీబ్రాండెడ్ వెర్షన్ తరహాలో ఉంది. మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్ తో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని రియల్ మీ అందించడం విశేషం. ఈ స్మార్ట్ ఫోన్ ధరను 25,90,000 వియత్నాం డాంగ్ లుగా(సుమారు రూ.8,500) నిర్ణయించారు.

ఇది 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇందులో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. దాని ధరను ఇంకా రియల్ మీ వెల్లడించలేదు. రియల్ మీ సీ3ఐ స్మార్ట్ ఫోన్ లో 6.5 అంగుళాల హెచ్ డీ+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లేను అందించారు. డిస్ ప్లే స్క్రీన్ టు బాడీ రేషియో 89.8 శాతంగా ఉంది. ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది.

ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగా పిక్సెల్ కాగా, మరో 2 మెగా పిక్సెల్ కెమెరాను కూడా అందించారు. సెల్ఫీల కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది. వైఫై, బ్లూటూత్ v5.0, జీపీఎస్, మైక్రో యూఎస్ బీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 195 గ్రాములు.

Tags :
|
|
|

Advertisement