Advertisement

  • జులై 13వ తేదీన రియల్ మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ సేల్

జులై 13వ తేదీన రియల్ మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ సేల్

By: chandrasekar Sat, 11 July 2020 2:43 PM

జులై 13వ తేదీన రియల్ మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ సేల్


జులై 13వ తేదీన రియల్ మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ జరగనుంది. ఈ ఫోన్ ఫిబ్రవరిలో లాంచ్ అయింది. దీనికి సంబంధించిన సేల్ మార్చిలో ఒకసారి జరిగింది. అప్పట్నుంచి నాలుగు నెలల పాటు దీని సేల్ అసలు జరగలేదు. అయితే ఈ ఫోన్ సేల్ జరగనప్పటికీ దీనికి సంబంధించిన ధర మాత్రం రూ.3,000 వరకు పెరిగింది. ఈ స్మార్ట్ ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.41,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.47,999గానూ నిర్ణయించారు. జులై 13వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు దీని సేల్ జరగనుంది. ఫ్లిప్ కార్ట్, రియల్ మీ.కాంల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మోస్ గ్రీన్, రస్ట్ రెడ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.

దీని స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 6.44 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, 12 మెగా పిక్సెల్ టెలిఫొటో సెన్సార్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ పొర్ ట్రెయిట్ సెన్సార్ లు కూడా ఇందులో ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం ముందువైపు 32 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు ఉన్నాయి. 5జీ, 4జీ వోల్టే, వైఫై 6, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ గా ఉంది. 65W ఫాస్ట్ చార్జింగ్ ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.

Tags :
|

Advertisement