Advertisement

రియల్ మీ వీ3 ఫోన్ లాంచ్...అత్యంత చవకైన 5జీ ఫోన్

By: chandrasekar Wed, 02 Sept 2020 11:47 AM

రియల్ మీ వీ3 ఫోన్ లాంచ్...అత్యంత చవకైన 5జీ ఫోన్


రియల్ మీ వీ3 ఫోన్ లాంచ్ అయింది. రియల్ మీ లాంచ్ చేసిన అత్యంత చవకైన 5జీ ఫోన్ ఇదే. తక్కువ ధరలో మంచి ఫీచర్లను అందించడం విశేషం. దీనిలో సెల్ఫీ కెమెరాను నాచ్ లో అందించారు. వెనకవైపు మూడు కెమెరాలు కూడా ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్ మొదటగా చైనాలో లాంచ్ అయింది.

రియల్ మీ వీ3 ధర

దీనిలో మొత్తం మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 999 యువాన్లుగా(సుమారు రూ.10,700) నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యువాన్లుగానూ(సుమారు రూ.15,000), 8 జీబీ ర్యామ్ + 128

జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యువాన్లుగా(సుమారు రూ.17,100) ఉంది. బ్లూ, సిల్వర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన సేల్ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

రియల్ వీ3 స్పెసిఫికేషన్లు

దీనిలో 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంది.

ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్ ను ఇందులో అందించారు. స్టోరేజ్ సామర్థ్యం 128 జీబీ వరకు ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ లను కూడా ఇందులో అందించారు. సెల్ఫీల కోసం ముందువైపు నాచ్ లో 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.

ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీయూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేయడం స్పెషల్.

5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని మందం 0.86 సెంటీమీటర్లు కాగా, బరువు 189.5 గ్రాములు.

Tags :
|

Advertisement