Advertisement

  • మరొకసారి తన మంచి మనసు చాటుకున్న రియల్ హీరో సోను సూద్

మరొకసారి తన మంచి మనసు చాటుకున్న రియల్ హీరో సోను సూద్

By: Sankar Thu, 01 Oct 2020 5:36 PM

మరొకసారి తన మంచి మనసు చాటుకున్న రియల్ హీరో సోను సూద్


లాక్ డౌన్ వేల వలస కార్మికులకు అండగా నిలిచి సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇక అప్పుడు మొదలు పెట్టిన మంచిపనులను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటీవల సోనూ పేద విద్యార్థుల‌ కోసం ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్ కార్య‌క్ర‌మాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యను అభ్యసిస్తూ డబ్బులు లేఖ ఆర్థిక ఇబ్బందులు ఎదురుకొంటున్నవారికి స్కాలర్ షిప్ లను ఇస్తానని హామీ ఇచ్చాడు సోనూ .

తాజాగా మరో విద్యార్థి చదువుకు సాయం చేసాడు సోనూ. ఓ విద్యార్థి తనకు వచ్చిన మార్కులను అటాచ్ చేసి నేను క్లాస్ లో టాపర్. కాని నాకు చదువుకునేంత ఆర్థిక స్థోమత లేదు తన చదువు కోసం సాయం చేయాలంటూ సోనూ సూద్ కు విజ్ఞప్తి చేశాడు. ఆ విద్యార్థి చేసిన విజ్ఞప్తికి సోనూసూద్ స్పందించాడు. అతని కోసం సరత్ ఐఏఎస్ అకాడమీతో మాట్లాడి వెంటనే సీటు ఇప్పించడంతో పాటు అందుకు సంబంధించిన అన్ని ఆర్థిక వనరులు సమకూర్చాడు.

ఈ మేరకు సోనూసూద్ ఆ విద్యార్ధి ట్వీట్ కు రీప్లే ఇస్తూ.. నువ్వు కలెక్టర్ అవుతావు.. నీ కోసం ఏర్పాటు చేశాను. ఇందుకు సహకరించిన ఐఏఎస్ సరత్ అకాడమీతో మాట్లాడినట్లుగా పేర్కొన్నారు. ఆ విద్యార్థికి సాయం చేసేందుకు ఒప్పుకున్నందుకు సరత్ అకాడమీకి కృతజ్ఞతలు అంటూ సోనూ సూద్ ట్వీట్ చేశాడు.

Tags :
|

Advertisement