Advertisement

  • స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మోడీ ఇచ్చిన వార్నింగ్ తో చర్చలకు సిద్ధం అని ప్రకటించిన చైనా

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మోడీ ఇచ్చిన వార్నింగ్ తో చర్చలకు సిద్ధం అని ప్రకటించిన చైనా

By: Sankar Tue, 18 Aug 2020 08:20 AM

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మోడీ ఇచ్చిన వార్నింగ్ తో చర్చలకు సిద్ధం అని ప్రకటించిన చైనా


భారత్‌తో అన్నిరకాల సమస్యలు పరిష్కరించుకొనేందుకు చర్చలకు సిద్ధమని చైనా ప్రకటించింది. రాజకీయంగా పరస్పరం విశ్వాసం పాదుగొల్పే చర్యలు చేపడుతామని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ తెలిపారు. రెండుదేశాల మధ్య దీర్ఘకాలిక ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

కాగా భారత సార్వభౌమత్వానికి సవాలువిసిరే ఎవరికైనా తగిన రీతిలో బదులిస్తామని స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ హెచ్చరించిన నేపథ్యంలో చైనా ఈ వ్యాఖ్యలు చేసింది. ‘భారత్‌, చైనా పక్కపక్కనే ఉండే దేశాలు. వందకోట్లకు పైగా జనాభాతో అభివృద్ధి చెందుతున్న దేశాలు.

ఈ దేశాలమధ్య శాంతి, సుస్థిరతలు రెండుదేశాలకు మాత్రమే కాకుండా ఈ ప్రాంతం, మొత్తం ప్రపంచానికి కూడా ఎంతో అవసరం’ అని లిజియాన్‌ పేర్కొన్నారు.కాగా ఇటీవల కాలంలో చైనా భారత్ మధ్య విభేదాలు ఎక్కువవుతున్న విషయం తెల్సిందే..గాల్వన్ లోయలో భారత్ సైనికులను పొట్టనబెట్టుకుంది చైనా, దీనికి ప్రతీకారంగా చైనా కు చెందిన యాప్స్ ను భారత్ నిషేదించింది..అయితే భారత్ మిత్ర దేశమైన నేపాల్ ను భారత్ కు వ్యతిరేకంగా చైనా వాక్యాలు చేయిస్తుంది..ఈ పరిస్థితుల్లో చైనా చర్చలకు సిద్ధమని ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది..



Tags :
|
|

Advertisement