Advertisement

  • ఐపీయల్ లో దూసుకొచ్చిన మరొక యువ కెరటం..తొలి మ్యాచ్ లోనే అదరగొట్టిన ఆర్సీబి ఓపెనర్

ఐపీయల్ లో దూసుకొచ్చిన మరొక యువ కెరటం..తొలి మ్యాచ్ లోనే అదరగొట్టిన ఆర్సీబి ఓపెనర్

By: Sankar Tue, 22 Sept 2020 10:53 AM

ఐపీయల్ లో దూసుకొచ్చిన మరొక యువ కెరటం..తొలి మ్యాచ్ లోనే అదరగొట్టిన ఆర్సీబి ఓపెనర్


ఐపీయల్ అనేది సీనియర్ ఆటగాళ్ల కంటే యువ ఆటగాళ్లను వెలుగు తీయడంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది..రోహిత్ శర్మ , బుమ్రా , పాండ్య వంటి స్టార్ ఆటగాళ్లు ఐపీయల్ రాణించి ఇండియన్ టీంలో స్థానం సుస్థిరం చేసుకున్నవారే ..తాజాగా మరొక యువ ఆటగాడు దూసుకొచ్చాడు..రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడుతున్న కేరళ కుర్రాడు దేవదూత్‌ పడిక్కల్‌ అరంగేట్రం ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే అదుర్స్‌ అనిపించాడు.

తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ సాధించి అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పడిక్కల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అరోన్‌ ఫించ్‌కు జతగా ఓపెనింగ్‌కు వచ్చాడు. పార్థీవ్‌ పటేల్‌ను పక్కన పెట్టి పడిక్కల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే యత్నంలో పడిక్కల్‌ అనుభవం ఉన్న ప్లేయర్‌లా ఆడాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లపై దాడికి దిగా అర్థం శతకం సాధించాడు.

ఆర్సీబీతో తరఫున అరంగేట్రం మ్యాచ్‌ల్లో యాభై అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో పడిక్కల్‌ ఐదోస్థానంలో నిలిచాడు. అంతకుముందు క్రిస్‌ గేల్‌(2011లో 102 నాటౌట్‌), ఏబీ డివిలియర్స్‌(2011లో 54 నాటౌట్‌), యువరాజ్‌ సింగ్‌(2014లో 52 నాటౌట్‌), శ్రీవాత్స్‌ గోస్వామి(2008లో 52)లు అరంగేట్రం మ్యాచ్‌ల్లో హాఫ్‌ సెంచరీలు సాధించిన ఆర్సీబీ ఆటగాళ్లు. ఆ తర్వాత పడిక్కల్‌ వారి సరసన చేరాడు.

Tags :
|
|

Advertisement