Advertisement

  • ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ లు ఆడటానికి అలవాటు పడ్డాము...విరాట్ కోహ్లీ

ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ లు ఆడటానికి అలవాటు పడ్డాము...విరాట్ కోహ్లీ

By: Sankar Fri, 18 Sept 2020 1:59 PM

ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ లు ఆడటానికి అలవాటు పడ్డాము...విరాట్ కోహ్లీ


క్రికెట్ మ్యాచ్ అంటే ముందుగా గుర్తొచ్చేది ప్రేక్షకుల కేరింతలు. స్టేడియం మొత్తం జనంతో నిండిపోయి ఉన్న మైదానంలో మ్యాచ్ ఆడుతుంటే ఆటగాళ్లకు కూడా ఊపు వస్తుంది ..అయితే కరోనా కారణంగా పరిస్థితులు అన్ని తలకిందులు అయ్యాయి..కరోనా ఇంతవరకు తగ్గకపోవడంతో ఇక ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు..దీనితో ఇంతకుముందు ఉన్న మజా , తీవ్రత ఇప్పుడు ఉండదు అని అందరు భావిస్తున్నారు..

అయితే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆటగాళ్లు బయో బబుల్‌కు అలవాటు పడిపోయారని ఆ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెప్పాడు. ఖాళీ స్టేడియాల్లో ఈవెంట్‌ జరుగుతున్నంత మాత్రాన మ్యాచ్‌ల్లోని తీవ్రత, ఉత్కంఠ ఏ మాత్రం తగ్గవని చెప్పాడు. ‘ఇది మాకు కొత్త అనుభవమే. కానీ మ్యాచ్‌ స్థాయి, పోటీ తగ్గనే తగ్గదు’ అని అన్నాడు. గత నెల 21న యూఏఈ చేరుకున్న కోహ్లి బృందం రెండు వారాలుగా ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతుంది. రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు కూడా ఆడింది.

ప్రేక్షకులు లేని ఆటకూ ఎంచక్కా అలవాటు పడిపోయింది. ‘బయో బబుల్‌తో ఎలా నెట్టుకు రావాలని ఆలోచించిన ఆటగాళ్లంతా ఇప్పుడు తేలిక పడ్డారు. మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించినా... ఇప్పుడైతే అంతా చక్కగా అలవాటు పడిపోయారు. మా వాళ్లకు బుడగతో ఇప్పుడే ఇబ్బంది లేదు. ఒకవేళ ఈ బబుల్‌కు అలవాటు పడకపోయి వుంటే కచ్చితంగా మేమంతా విచారంగానే, ఏదో మాయలో ఉన్నట్లే ఉండేవాళ్లం’ అని కోహ్లి తెలిపాడు

Tags :
|

Advertisement