Advertisement

  • ఎబి డివిలియర్స్ విశ్వరూపం ...రాజస్థాన్ పై ఆర్సీబి ఘనవిజయం

ఎబి డివిలియర్స్ విశ్వరూపం ...రాజస్థాన్ పై ఆర్సీబి ఘనవిజయం

By: Sankar Sun, 18 Oct 2020 06:55 AM

ఎబి డివిలియర్స్ విశ్వరూపం ...రాజస్థాన్ పై ఆర్సీబి ఘనవిజయం


ఐపీయల్ పదమూడవ సీజన్లో కోహ్లీ కెప్టెన్సీ లోని రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు దూసుకుపోతుంది ..ఆ జట్టు స్టార్ ఆటగాడు ఎబి డివిలియర్స్ వీర విధ్వంసంతో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబి ఘనవిజయం సాధించింది.. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. రాయల్స్ కెప్టెన్ స్మిత్ 36 బంతుల్లో 57 పరుగులతో అర్ధశతకం చేసాడు. ..

ఇక ఆ తర్వాత 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన బెంగళూర్ బ్యాట్స్మెన్స్ ను రాయల్స్ బౌలర్లు బాగానే కట్టడి చేసారు. అయిన కెప్టెన్ కోహ్లీ ఆచితూచి షాట్స్ ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. కానీ 14 ఓవర్లో కార్తీక్ త్యాగి కోహ్లీని పెవిలియన్ కు చేర్చి బెంగళూర్ నిదెబ్బ కొట్టాడు. ఆ తర్వాత పరుగులు చేయడానికి ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ ఇబ్బంది పడటంతో జట్టుకు చివరి రెండు ఓవర్లలో 35 పరుగులు కావాల్సి వచ్చింది. అప్పుడు మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ రెచ్చిపోయాడు. వరుసగా మూడు సిక్స్ లు బాదడంతో 19 ఓవర్లో 25 పరుగులు రాబట్టింది బెంగళూర్.

ఇక చివరి ఓవర్లో 10 పరుగులు కావాల్సి ఉండగా రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది బెంగళూర్. ఈ మ్యాచ్ లో డివిలియర్స్ మొత్తం 6 సిక్స్ లు బాదడంతో కేవలం 22 బంతుల్లోనే 55 పరుగులు చేసాడు. ఇక రాయల్స్ బౌలర్లలో శ్రేయాస్ గోపాల్, కార్తీక్ త్యాగి, రాహుల్ తెవాటియా ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో బెంగళూర్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానికి చేరుకోగా రాజస్థాన్ అదే ఏడో స్థానంలో ఉంది.

Tags :
|
|

Advertisement