Advertisement

యాప్ లోన్ లపై ఆర్‌బిఐ హెచ్చరిక

By: chandrasekar Wed, 23 Dec 2020 9:20 PM

యాప్ లోన్ లపై ఆర్‌బిఐ హెచ్చరిక


ప్రస్తుతం రాష్ట్రంలో యాప్‌ల ద్వారా అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి, ఆ రుణాలు వసూలు చేయడానికి చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతున్నారన్న సమాచారం నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోనున్నారు. యాప్‌ ద్వారా అప్పులు తీసుకుని సమయానికి చెల్లించక పోవడంతో వడ్డీ, అసలు కలిపి భారీ మొత్తంగా తయారైందని తీసుకున్న డబ్బులు చెల్లించకపోతే బాధితుడి కాంటాక్టు లిస్టులో ఉన్న వాళ్లందరికీ యాప్‌ నిర్వాహకులు వివరాలు పంపి అవమానిస్తున్నారు. వాటి ద్వారా చాలా మందికి రుణాలు ఇచ్చి అధిక వడ్డీలు విధిస్తూ వేధింపులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఇందుకోసం రిజర్వు బ్యాంకు కొన్ని సూచనలు చేసింది. రిజర్వ్ బ్యాంకులో నమోదు చేసుకున్న బ్యాంకులు బ్యాంకుయేతర ఆర్థిక సంస్థల నుండి మాత్రమే రుణాలు తీసుకోవాలని తెలిపింది. గుర్తు తెలియని వ్యక్తులనుండి రిజర్వు బ్యాంకు లో నమోదు కానీ ప్రైవేట్ యాప్ ల ద్వారా అప్పులు తీసుకోవద్దని వారికి బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వవద్దు అని తెలిపారు. యాప్ ద్వారా రుణదాతల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Tags :
|
|
|

Advertisement