అదనపు రుణాల సమీకరణలో గడువును ఆరు నెలలు పొడిగించిన ఆర్బీఐ
By: chandrasekar Wed, 30 Sept 2020 10:08 AM
మార్కెట్ రుణాలు, ఓవర్‌డ్రాఫ్ట్
సదుపాయం ద్వారా నిధులను సమీకరించునేందుకు రాష్ట్రాలకు ఇచ్చిన అదనపు వెసులుబాటును
రిజర్వు బ్యాంకు మరింత పొడిగించింది. ఆర్బీఐ గడువును ఆరు నెలలు పొడిగించి౦ది.
కరోనా సంక్షోభంతో
ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి అధిగమించడంలో రాష్ట్రాలకు చేయూతనిచ్చేందుకు ఈ
చర్య చేపట్టింది.
కరోనా సంక్షోభాన్ని
దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌లో ఆర్బీఐ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు
నిధుల సమీకరణలో అదనపు వెసులుబాటును కల్పించిన విషయం తెలిసిందే. ఈ నెల 30తో
ముగియనున్న గడువును మరో ఆరు నెలలు పొడిగించినట్టు ఆర్బీఐ ప్రకటించింది.
Tags :
rbi |
extends |
maturity |
by six |