Advertisement

  • ట్విట్టర్లో అత్యధిక మంది ఫోలోవర్స్ ఉన్న కేంద్ర బ్యాంకు గా ఆర్బీఐ రికార్డు

ట్విట్టర్లో అత్యధిక మంది ఫోలోవర్స్ ఉన్న కేంద్ర బ్యాంకు గా ఆర్బీఐ రికార్డు

By: Sankar Mon, 23 Nov 2020 11:19 PM

ట్విట్టర్లో అత్యధిక మంది ఫోలోవర్స్ ఉన్న కేంద్ర బ్యాంకు గా ఆర్బీఐ రికార్డు


రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ట్విట్టర్‌ ఖాతా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ఖాతాను 10లక్షల మందికి పైగా ఫాలో అవుతుండగా.. అత్యధిక ఫాలోవర్లు ఉన్న కేంద్ర బ్యాంక్‌గా నిలిచింది.

ప్రముఖ బ్యాంక్‌లు అయిన యూస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ల కంటే ఆర్బీఐకి ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండటం గమనార్హం. ఇక ఆర్బీఐ తరువాత 7.74లక్షల ఫాలోవర్లతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మెక్సికో రెండో స్థానంలో ఉండగా.. 7.57లక్షల ఫాలోవర్లతో, బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా మూడో స్థానంలో ఉంది..

దీనిపై స్పందించిన ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌.. ఆర్బీఐ ట్విట్టర్‌ ఖాతాకు ఫాలోవర్ల సంఖ్య 10లక్షలను దాటింది. ఇది నిజంగా సరికొత్త మైలురాయి. ఆర్బీఐలోని అందరికీ అభినందనలు అని పేర్కొన్నారు. కాగా 2012 జనవరిలో ఆర్బీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాను ప్రారంభించింది

Tags :
|

Advertisement