Advertisement

  • తాను అంటే ఏంటో రాయుడు నిరూపించుకున్నాడు..హర్భజన్ సింగ్

తాను అంటే ఏంటో రాయుడు నిరూపించుకున్నాడు..హర్భజన్ సింగ్

By: Sankar Sun, 20 Sept 2020 8:28 PM

తాను అంటే ఏంటో రాయుడు నిరూపించుకున్నాడు..హర్భజన్ సింగ్


నిన్న ప్రారంభమైన ఐపీఎల్ 2020 మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు అంబటి రాయుడు. మొదట బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థి జట్టు అయిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఆ తర్వాత 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన చెన్నై జట్టు మొదట 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన అంబటి రాయుడు 48 బంతుల్లో 71 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అయితే ఈ ఏడాది ఐపీఎల్ నుండి తప్పుకున్న చెన్నై జట్టు బౌలర్ హర్భజన్ సింగ్ తమ జట్టు సాధించిన మొదటు విజయం పై స్పందించాడు. హర్భజన్ మాట్లాడుతూ... ఈ మ్యాచ్ లో తాను ఏంటో రాయుడు మళ్ళీ చూపించాడు. అలాగే గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ జట్టులో ఆడటానికి కూడా తనకు అర్హత ఉందని రాయుడు నిరూపించుకున్నాడు అని తెలిపాడు. అలాగే రెండేళ్ల క్రితం 2018 ఐపీఎల్ సీజన్ మొదటి మ్యాచ్ లో కూడా ముంబై పై చెన్నై విజయం సాధించి ఫైనల్ లో కప్ అందుకుంది. కాబట్టి ఈ ఏడాది కూడా అలాగే జరుగుతుంది అని హర్భజన్ అన్నాడు.

కాగా గత ఏడాది వరల్డ్ కప్ కు ముందు జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రాయుడు ను అకస్మాత్తుగా ప్రపంచ కప్ జట్టులో చోటు ఇవ్వలేదు...దీనితో అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అయ్యాయి..రాయుడు స్థానంలో విజయ్ శంకర్ కు చోటిచ్చారు , ఆ తర్వాత కూడా జట్టులో స్థానం ఉన్న కూడా రాయుడు బదులు పంత్ ను తీసుకున్నారు .దీనితో రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు .ఆ తర్వాత రిటైర్మెంట్ వెనక్కి తీసుకోని మల్లి క్రికెట్ లో కొనసాగుతున్నాడు..

Tags :
|
|

Advertisement