Advertisement

  • సంచలన ఇన్నింగ్స్ ఆడిన జడేజా మీద ప్రశంసలు కురిపించిన రవిశాస్త్రి

సంచలన ఇన్నింగ్స్ ఆడిన జడేజా మీద ప్రశంసలు కురిపించిన రవిశాస్త్రి

By: Sankar Fri, 30 Oct 2020 2:33 PM

సంచలన ఇన్నింగ్స్ ఆడిన జడేజా మీద ప్రశంసలు కురిపించిన రవిశాస్త్రి


నిన్న రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా సంచలన ఇన్నింగ్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే.. గెలుపునకు జట్టు 30 పరుగుల దూరంలో ఉన్న సమయంలో 29 రన్స్‌ చేసిన రవీంద్ర జడేజా అందరిచేతా ప్రశంసలు అందుకుంటున్నాడు.

కీలక సమయంలో జట్టును ఆదుకున్న ‘సర్‌’ జడేజాను సూపర్‌కింగ్స్‌ అభిమానులు పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అద్భుత ఇన్నింగ్స్‌ ఆడావు అంటూ కొనియాడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి సైతం జడేజా సూపర్‌ ఇన్నింగ్స్‌పై సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు.

‘చెలరేగిపోయి ఆడాడు. హార్స్‌మాన్‌ అద్భుత ప్రదర్శన చూడటం ఎంతో సంతోషంగా ఉంది’’ అంటూ గుర్రం ముఖం ఎమోజీని ఇందుకు జతచేశాడు. కాగా టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కత్తిసాము, కర్రసాముతో పాటు గుర్రపు స్వారీ అంటే ఎంతటి మక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

గతంలో అనేకమార్లు ఈ విద్యలను ప్రదర్శించిన జడేజా, ఇందుకు సంబంధించిన వీడియోలు షేర్‌ చేయగా అప్పట్లో వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. పరుగుల వేటలో గుర్రాన్ని దౌడు తీయించినట్లుగా చెలరేగి ఆడాడనే ఉద్దేశంలో రవిశాస్త్రి, జడేజాను హార్స్‌మాన్‌గా అభివర్ణించాడు.

Tags :

Advertisement