Advertisement

  • కెజిఎఫ్ 2 నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్

కెజిఎఫ్ 2 నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్

By: Sankar Mon, 26 Oct 2020 2:07 PM

కెజిఎఫ్ 2 నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్


కెజిఎఫ్ చాప్టర్ వన్ సినిమాతో దేశం మొత్తాన్ని ఆకట్టుకుంటున్న కన్నడ స్టార్ హీరో యాష్ ఆ చిత్రానికి కొనసాగింపుగా కెజిఎఫ్ చాప్టర్ 2 లో నటిస్తున్న విషయం తెలిసిందే..ఈ చిత్రానికి కూడా చాప్టర్ వన్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు..

చాప్టర్ 1 సాధించిన విజయంతో పెరిగిన అంచనాలకు ధీటుగా దర్శక నిర్మాతలు `కేజీఎఫ్ ` చాప్టర్ 2ను రాజీ లేకుండా నిర్మిస్తున్నారు.కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి అధీరా గా సంజయ్ దత్ లుక్ రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఈ సినిమా మరోసారి సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజాగా 'కేజీఎఫ్ 2' నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. రవీనా టాండర్ పుట్టిన రోజు సందర్బంగా ఆమె లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో రవీనా..రమికా సేన్ పాత్రలో నటిస్తోంది. ఈ లుక్ లో ఎర్రటి చీర ధరించి చట్టసభల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags :
|

Advertisement