Advertisement

  • అందరూ కలిసికట్టుగా ..ఒకే తాటిపైకి రావాలి ...ఇన్‌స్టాగ్రామ్‌లో రతన్ టాటా భావోద్వేగ పోస్ట్

అందరూ కలిసికట్టుగా ..ఒకే తాటిపైకి రావాలి ...ఇన్‌స్టాగ్రామ్‌లో రతన్ టాటా భావోద్వేగ పోస్ట్

By: Sankar Mon, 22 June 2020 2:48 PM

అందరూ కలిసికట్టుగా ..ఒకే తాటిపైకి రావాలి ...ఇన్‌స్టాగ్రామ్‌లో రతన్ టాటా భావోద్వేగ పోస్ట్



ఇండియాలో దిగ్గజ పారిశ్రామిక వేత్తల్లో ఒకడైన రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక బావోద్వేగకరమైన పోస్ట్ పెట్టారు ..కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు సవాళ్లను ఎదుర్కొంటున్నారని, ఇది ఒకరికి ఒకరు సాయంచేసుకోవాల్సిన సమయమని తెలిపారు..ఆన్‌లైన్‍‌లో విద్వేషాలు, బెదిరింపులకు దూరంగా ఉండాలని నెటిజన్లకు పిలుపునిచ్చారు..కానీ జనాలు ఆన్‌లైన్ వేదికగా పరస్పర దూషణలతో మనస్సులు గాయపరుచుకుంటున్నారు అన్నారు.

ఈ ఏడాది ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సవాళ్లతో కూడుకున్నది. నెటిజన్లు తొందరపాటు నిర్ణయాలతో, దురుసుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఒకరిని ఒకరు కిందకు లాగే సమయం కాదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నెగిటివిటికి దూరంగా ఉండటంతో పాటు ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలి' అని పేర్కొన్నారు. ఇది సవాళ్లతో నిండిని సంవత్సరమని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరి పట్ల మరొకరికి దయ, అవగాహన, సహనం అవసరం అని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం అందరం కలసికట్టుగా.. ఏకతాటి పైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

అసలు తాను ఆన్‌లైన్‌లో గడిపేది చాలా తక్కువ సమయమన్నారు. ద్వేషం, వ్యతిరేకతలను పక్కన పెట్టి, ఇది అందరికీ మంచి చేసే ప్రదేశంగా మారుతుందని రతన్ టాటా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ తెగ వైరలవుతోంది.అయితే కరోనా కష్టకాలంలో రతన్ టాటా అనేక సేవ కార్యక్రమాలను చేసాడు..కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు 1500 కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాలు చేపడతాం అని ఈ టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ చెప్పిన సంగతి తెలిసిందే ..

Tags :
|
|

Advertisement