Advertisement

  • ఢిల్లీ క్యాపిటల్స్ ను దెబ్బతీసిన రషీద్‌ ఖాన్‌....

ఢిల్లీ క్యాపిటల్స్ ను దెబ్బతీసిన రషీద్‌ ఖాన్‌....

By: chandrasekar Wed, 28 Oct 2020 10:14 AM

ఢిల్లీ క్యాపిటల్స్ ను దెబ్బతీసిన రషీద్‌ ఖాన్‌....


ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో సత్తా చాటుకుంది. కొండంత లక్ష్య ఛేదనలో యువ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌(3/7), సందీప్‌ శర్మ(2/27) ధాటికి ఢిల్లీ 131 పరుగులకే ఆలౌటైంది. దీంతో సన్‌రైజర్స్‌ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రషీద్‌ ఈ సీజన్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు (4-0-7-3) నమోదు చేశాడు. రిషబ్‌ పంత్‌(36: 35 బంతుల్లో 3ఫోర్లు, సిక్సర్‌) టాప్‌ స్కోరర్‌. ఆరంభంలో రహానె(26) ఫర్వాలేదనిపించగా మిగతా బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమయ్యారు.

ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(66: 34 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు), వృద్ధిమాన్‌ సాహా(87: 45 బంతుల్లో 12ఫోర్లు, 2సిక్సర్లు) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో అలరించారు. ఓపెనర్లు వీరవిహారం చేయడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగులు చేసింది. ఆఖర్లో మనీశ్‌ పాండే(44నాటౌట్:‌ 31 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్‌ పటిష్ఠ స్కోరు సాధించింది.

Tags :
|

Advertisement