Advertisement

క్రిస్‌గేల్‌ అరుదైన ఘనత...

By: chandrasekar Fri, 16 Oct 2020 8:00 PM

క్రిస్‌గేల్‌ అరుదైన ఘనత...


దుబాయ్: ఐపీఎల్ లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ విధ్వంసకర ఓపెనర్‌ క్రిస్‌గేల్‌ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 4500 పరుగులు సాధించిన ఎనిమిదో ఆటగాడిగా గేల్‌ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

పదమూడో సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే క్రిస్‌ గేల్‌ (45 బంతుల్లో 53; ఒక ఫోర్‌, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేజి పోయాడు. గురువారం షార్జా వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో 16 పరుగులు పూర్తి చేసి ఈ అరుదైన ఘనతను సాధించాడు.

పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన 13వ ఓవర్లో బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లెగ్‌లో భారీ సిక్సర్‌ బాది 4,500 రన్‌ మార్క్‌ చేరుకున్నాడు. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో క్రిస్‌గేల్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత బెంగళూరు జట్టులో చేరి ఒంటిచేత్తో ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు. 2018 ఐపీఎల్‌ వేలంలో గేల్‌ను పంజాబ్‌ కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో అతని అత్యధిక స్కోరు 175 నాటౌట్‌ కావడం గమనార్హం.

Tags :
|
|

Advertisement