Advertisement

  • ప్రభుత్వ భూముల పరిరక్షణలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

ప్రభుత్వ భూముల పరిరక్షణలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

By: chandrasekar Sat, 05 Sept 2020 10:10 AM

ప్రభుత్వ భూముల పరిరక్షణలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్


ఇటు ప్రభుత్వ భూముల పరిరక్షణలోను అటు రైతు భూముల పరిరక్షణలోను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్ కుమార్ తగిన చర్యలు తీసికొని సమస్యలను పరిష్కరిస్తున్నారు. రైతు సమస్యల పరిష్కారం, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడటంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. సమస్యలను పరిష్కరించడం కోసం ఆయన చూపుతోన్న చొరవ అన్నదాతలను ఆకట్టుకుంటోంది.

తన భూమి సమస్యను పరిష్కారించాలంటూ రెండు నెలల క్రితం ఓ రైతు కలెక్టర్‌కు మెసేజ్ పెట్టారు. వెంటనే స్పందించిన అమోయ్ కుమార్ రికార్డులను స్వయంగా సరిచేసి మరీ రెండు రోజుల్లోనే ఆ సమస్యను పరిష్కరించారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌కు ఆనుకొని ఉండటంతో ఇక్కడి భూముల ధర కోట్లు పలుకుతుంది. దీంతో ప్రభుత్వ భూముల కబ్జాలు కోర్టు కేసులు కూడా ఎక్కువే. ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్ కబ్జా సమస్యలను పరిష్కరించి కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడారు.

ఆక్రమణకు గురయ్యే చెరువులను కాపాడటం కోసం జిల్లాలోని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలో కరోనా కట్టడిలోనూ అమోయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశంలో కోవిడ్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్న కలెక్టర్ల వివరాలను జూన్ నెలారంభంలో ‘ఫేమ్ ఇండియా’ ఎంపిక ప్రకటించింది. ఈ జాబితాలో కలెక్టర్ అమోయ్ కుమార్ టాప్-50లో చోటు దక్కించుకున్నారు.

చాలా చురుకుగా చర్యలు తీసికోవడంలో ఈయన మంచి పేరు సంపాదించారు. 2013 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారైన అమోయ్ కుమార్ 2018 డిసెంబర్‌లో సూర్యాపేట కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. నేరేడుచర్లలో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వివాదాస్పదం కావడంతో ఈ ఏడాది జనవరి చివర్లో ప్రభుత్వం ఆయన్ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేసింది. అంతకు ముందు ఆయన కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు.

Tags :

Advertisement