Advertisement

  • రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటికు తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం

రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటికు తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం

By: chandrasekar Thu, 13 Aug 2020 5:58 PM

రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటికు తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం


రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటికు తృటిలో తప్పిన పెద్ద కారు ప్రమాదం. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు, రానా తమ్ముడుకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అభిరామ్ దగ్గుబాటి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. సైబరాబాద్ పరిధిలోని మణికొండ లో అభిరామ్ ప్రయాణిస్తోన్న కారుకు త‌ృటిలో పెను ప్రమాదం తప్పింది.

అభిరామ్ ప్రయాణిస్తోన్న కారును మణికొండలోని పంచవటి కాలనీలో ఎదురుగా వచ్చిన మరో కారు ఢీ కొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇది మాములుగా జరిగిన ప్రమాదమే నని ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదంకానీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అభిరామ్ గతంలో శ్రీరెడ్డితో సంబంధం పెద్ద వివాదానికి దారి తీసిన సంగతి అందరికి తెలిసిందే.

కరోనా కారణంగా తక్కువ ఆహ్వానితులతో అభిరామ్ దగ్గుబాటి యొక్క అన్న రానా దగ్గుబాటి వివాహాం ఈ నెల 8న రామానాయుడు స్టూడియోలలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్ళిలో రక రకాల ఆంధ్ర మరియు మార్వాడి స్టైల్ ఫుడ్ లతో విందును ఏర్పాటు చేసారు.

Tags :
|

Advertisement