Advertisement

  • ఘనంగా రానా పెళ్లి ..హాజరు అయిన రామ్ చరణ్ , అల్లు అర్జున్

ఘనంగా రానా పెళ్లి ..హాజరు అయిన రామ్ చరణ్ , అల్లు అర్జున్

By: Sankar Sun, 09 Aug 2020 10:45 AM

ఘనంగా రానా పెళ్లి ..హాజరు అయిన రామ్ చరణ్ , అల్లు అర్జున్



టాలీవుడ్ భల్లాలదేవుడు దగ్గుబాటి వారసుడు రానా ఓ ఇంటి వాడు అయ్యాడు ..నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ లిస్ట్ లో ముందు వరుసలో ఉన్న రానా తాజాగా తన బాచిలర్ జీవితానికి ముగింపు పలికాడు ..తన ప్రేయసి మిహిక బజాజ్ ను అతి కొద్దీ మంది బంధువుల సమక్షంలో మెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచాడు

శనివారం నాడు హైదరాబాద్‌ రామానాయుడు స్టుడియో వీరి వివాహానికి వేదికైంది. శనివారం రాత్రి 8.30 నిమిషాలకు వీరి వివాహం జరగ్గా.. ఇరుకుటుంబాల నుంచి కేవలం 30 మంది మాత్రమే బంధువులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇండస్ట్రీ నుంచి సమంతతో పాటు రామ్ చరణ్, ఉపాసన, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సమంత, నాగచైతన్య‌లు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.



rana daggupati,gets,married,miheeka bajaj,ram charan,allu arjun ,ఘనంగా , రానా పెళ్లి , హాజరు అయిన,  రామ్ చరణ్ , అల్లు అర్జున్



కాగా కరోనా కారణంగా కేవలం అతి కొద్దీ మంది బంధువుల సమక్షంలోనే పెళ్లి నిర్వహించారు ..ముందుగానే పెళ్ళికి వచ్చే వారందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు చేయించారు .. ఈ వివాహ వేడుక పనుల్ని ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం నిర్వహించింది. పెళ్లికి వచ్చిన అతిథులకు తెలుగు వంటకాలతో పాటు.. రాజస్థాన్ వంటకాలతో విందు అందించారు. హైదరాబాద్‌లో తాజ్ ఫలక్‌నుమా హోటల్ నుంచి ఈ వంటకాలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

Tags :
|

Advertisement