Advertisement

  • సచిన్ ఉన్నప్పటికి ద్రావిడ్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం దక్కించుకున్నాడు ..రమీజ్‌రాజా

సచిన్ ఉన్నప్పటికి ద్రావిడ్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం దక్కించుకున్నాడు ..రమీజ్‌రాజా

By: Sankar Fri, 07 Aug 2020 4:20 PM

సచిన్ ఉన్నప్పటికి ద్రావిడ్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం దక్కించుకున్నాడు ..రమీజ్‌రాజా



సచిన్ టెండూల్కర్ ..ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ముందు వరుసలో ఉంటాడు ..టెస్టులు , వన్ డే లు ఇలా ఫార్మటు ఏదయినా సచిన్ పరుగుల వరద పారించాడు ..అత్యధిక సెంచరీలు , అత్యధిక పరుగులు ఇలా అన్ని రికార్డులు తన పేరిట లికించుకున్నాడు ..

అయినా కూడా ఇండియన్ టెస్ట్ క్రికెట్ లో అత్యుత్తమ ఆటగాడు ఎవరు అంటే అందరు సచిన్ పేరుతో పాటుగా మరోక ఆటగాడి పేరు కూడా చెబుతారు ..అతడే ది వాల్ , మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్.సచిన్ లాంటి దిగ్గజ ఆటగాడు టీం లో ఉన్న కూడా సచిన్ తో పాటు సమానంగా పోటీపడి రాణించాడు ద్రావిడ్ ..ఇపుడు పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా కూడా ద్రవిడ్ మీద ఇలాంటి ప్రశంసలే కురిపించాడు ..

సచిన్‌లాంటి గొప్ప క్రికెటర్‌ జట్టులో ఉన్న రోజుల్లో గంటలకొద్దీ క్రీజులో పాతుకుపోయి బ్యాటింగ్‌ చేయగల దిట్టగా తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకున్న ఆటగాడంటూ ద్రావిడ్‌ను కీర్తించాడు పాక్‌ మాజీ కెప్టెన్‌ రమీజ్‌ రాజా. కానీ టెండూల్కర్‌లా ద్రావిడ్‌ అసాధారణ క్రికెటర్‌ కాదని అభిప్రాయపడ్డాడు. ‘ద్రావిడ్‌..సచిన్‌ అంతటి అద్భుత ప్రతిభావంతుడు కాకపోవచ్చు. కానీ ఓ గొప్ప క్రికెటర్‌తో పోటీపడి ద్రావిడ్‌ తనకంటూ ఓ స్థానం సంపాదించుకోవడం సామాన్యమైన విషయం కాదు. కొన్ని సమయాల్లో టెండూల్కర్‌ను మించి ద్రావిడ్‌ ఆడిన విషయాన్ని గుర్తించాలి’ అని రమీజ్‌రాజా చెప్పుకొచ్చాడు.

Tags :
|
|

Advertisement