Advertisement

  • ఏపీ ప్రభుత్వం‌పై హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు: నిమ్మగడ్డ రమేశ్ కుమార్

ఏపీ ప్రభుత్వం‌పై హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు: నిమ్మగడ్డ రమేశ్ కుమార్

By: chandrasekar Thu, 25 June 2020 1:05 PM

ఏపీ ప్రభుత్వం‌పై హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు: నిమ్మగడ్డ రమేశ్ కుమార్


నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనను ఏపీ ఈసీగా నియమించాలన్న తీర్పును ఏపీ ప్రభుత్వం అమలు చేయడంలేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తీర్పు అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రతివాదులుగా ఏపీ సీఎస్, పంచాయతీశాఖ కార్యదర్శి, ఏపీ ఎన్నికల కార్యదర్శులను చేర్చారు.

రమేశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ను నిమ్మగడ్డ రమేశ్ కుమార్ 13న ఓ హోటల్‌లో కలిసి వీడియోలు వెలుగులోకి రావడం ఏపీ రాజకీయాల్లో దూమారం రేపింది. నిమ్మగడ్డను సుజనా చౌదరి, కామినేని ఎందుకు కలిశారో సమాధానం చెప్పాలని వైసీపీ డిమాండ్ చేసింది.

వీరంతా కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించింది. అయితే తాము నిమ్మగడ్డను కలవడంలో ఎలాంటి తప్పులేదని సుజనా చౌదరి, కామినేని వివరణ ఇచ్చారు. దీనిపై ఏపీ రాజకీయాల్లో దుమారం కొనసాగుతుండగానే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏపీ ప్రభుత్వం తీరుపై హైకోర్టును ఆశ్రయించడం ముఖ్య విషయం.

Tags :
|

Advertisement