Advertisement

  • ఆ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిది ..రమీజ్ రాజా

ఆ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిది ..రమీజ్ రాజా

By: Sankar Tue, 11 Aug 2020 8:01 PM

ఆ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిది ..రమీజ్ రాజా



ఏడాది క్రితం వరకు పాకిస్తాన్ కు అన్ని ఫార్మటు లలో కెప్టెన్ గా వ్యవహరించిన ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ..కానీ ఏడాది తిరిగేలోపు కెప్టెన్సీ తో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయాడు ..అయితే తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు సర్ఫరాజ్ ఎంపిక అయినప్పటికీ బెంచ్ మీదనే ఉన్నాడు ..అంతేకాకుండా మ్యాచ్ మధ్యలో ఆటగాళ్లకు డ్రింక్స్ మోస్తూ కనిపించాడు ..

పాక్ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో 12వ ఆట‌గాడిగా క్రీజులో ఉన్న ప్లేయ‌ర్ కోసం స‌ర్ఫ‌రాజ్ బూట్లు తీసుకొని మైదానంలోకి వెళ్ల‌డంపై తీవ్ర చ‌ర్చ జ‌రిగింది. ఈ అంశంపై అక్త‌ర్ తీవ్రంగా స్పందించిన విష‌యం తెలిసిందే. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి త‌ప్పుకొని ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌కే ప‌రిమితం కావ‌డం మంచిద‌ని ఆ జ‌ట్టు మాజీ ఆట‌గాడు ర‌మీజ్ ర‌జా పేర్కొన్నాడు..

ఈ నేప‌థ్యంలో ర‌మీజ్ మాట్లాడుతూ.. `ఈ విష‌యాన్ని నేను పుస్త‌కంలో కూడా ప్ర‌స్తావించాను. ఒక‌సారి జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాక తిరిగి బెంచ్‌పై కూర్చోవ‌డం చాలా క‌ష్టం.స‌ర్ఫ‌రాజ్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కావ‌డం మంచింది. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి త‌ప్పుకొని లిమిటెడ్ ఓవ‌ర్స్‌పై దృష్టి పెట్ట‌డం ఉత్త‌మం`అని అన్నాడు.

Tags :
|
|

Advertisement