Advertisement

  • ఇలా గెలిచే మ్యాచ్ లను ఓడిపోవడం ఒక్క పాకిస్తాన్ కు మాత్రమే సాధ్యం ..రమీజ్ రాజా

ఇలా గెలిచే మ్యాచ్ లను ఓడిపోవడం ఒక్క పాకిస్తాన్ కు మాత్రమే సాధ్యం ..రమీజ్ రాజా

By: Sankar Tue, 11 Aug 2020 07:20 AM

ఇలా గెలిచే మ్యాచ్ లను ఓడిపోవడం ఒక్క పాకిస్తాన్ కు మాత్రమే సాధ్యం ..రమీజ్ రాజా



పాకిస్తాన్ జట్టు క్రికెట్ లో అనిశ్చితికి మారుపేరు ..ఎంతో కష్టం అనుకున్న మ్యాచ్ లను అలవోకగా గెలుస్తుంది ..ఎంతో సింపుల్ గా గెలవాల్సిన మ్యాచ్ ను అంతే సింపుల్ గా ఓడిపోతుంది ..తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ లో విజయం ఖాయం అనుకున్న దశలో అనూహ్యంగా పాకిస్తాన్ జట్టు ఓటమి పాలు అయింది ..దీనితో పాక్ మాజీ ఆటగాళ్లు ఆ జట్టును దుయ్యబడుతున్నారు ..

ఆ జట్టు మాజీ ఆటగాడు తొలి టెస్టులో పాక్ ఓటమిపై రమీజ్ రాజా మాట్లాడుతూ ‘‘277 రన్స్ ఛేదనకి దిగిన ఇంగ్లాండ్ టీమ్‌ని 117/5తో పాక్ ఒత్తిడిలోకి నెట్టగలిగింది. ఇంత మంచి పొజీషన్‌లో ఉండి మ్యాచ్‌ని చేజార్చుకోవడం బహుశా.. పాకిస్థాన్ టీమ్‌కే చెల్లింది. 107 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పాక్‌కి లభించింది. కానీ.. ఇంగ్లాండ్‌ ముందు 250+ టార్గెట్ ఉంచితే గెలిచేయచ్చని పాక్ టీమ్ భావించింది. ఛేదనలో ఇంగ్లాండ్ టీమ్ 117 పరుగులకే టాప్ బ్యాట్స్‌మెన్‌లు ఔటైపోయారు.

కానీ.. ఆరో వికెట్‌కి వోక్స్, బట్లర్‌లు 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పే అవకాశం కల్పించేశారు. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే..? జోస్ బట్లర్ పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోసం తీవ్ర ఒత్తిడిలో ఆ మ్యాచ్‌ ఆడాడు. అయినప్పటికీ.. అతడ్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ఇలా మ్యాచ్‌లు చేజార్చుకునే పాకిస్థాన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో ఉండటంలో ఆశ్చర్యమేముంది..?’’ అని రమీజ్ రాజా చురకలేశాడు.

Tags :
|

Advertisement