Advertisement

  • సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కు కరోనా పాజిటివ్ ..వెల్లడించిన వర్మ లాయర్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కు కరోనా పాజిటివ్ ..వెల్లడించిన వర్మ లాయర్

By: Sankar Tue, 11 Aug 2020 5:57 PM

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కు కరోనా పాజిటివ్ ..వెల్లడించిన వర్మ లాయర్



లాక్ డౌన్ లో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ రామ్ గోపాల్ వర్మ సృష్టించిన సంచలనం అంత ఇంతా కాదు..వరుసగా వివాదాస్పద సినిమాలతో సంచలనాలు సృష్టించాడు ..క్లయిమాక్ , నగ్నం , పవర్ స్టార్ వంటి సినిమాలతో వర్మ మంచి కలెక్షన్స్ రాబట్టాడు ..అయితే అదే ఊపులో మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయి , మారుతీ రావు ల ఇన్సిడెంట్ ఆధారంగా మర్డర్ సినిమాను ప్రకటించాడు ..దీనితో ప్రణయ్ కుటుంబం నుంచి దీనికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది

తనను బజారుకు ఈడ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రణయ్ భార్య అమృత నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈనెల 11 లోగా నిర్మాతలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే, ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న నట్టి కరుణ కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ కౌంటర్ దాఖలు చేయలేదు.

కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో వివరణ ఇవ్వాలని వర్మ న్యాయవాదిని కోర్టు అడగగా.. తన క్లయింట్‌కు కరోనా సోకిందని, అందువల్ల పిటిషన్‌కు జవాబు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. దీంతో అమృత వేసిన పిటిషన్ విచారణను ఈ నెల 14కి వాయిదా కోర్టు వాయిదా వేసింది. మరి ఆరోజైనా వర్మ కోర్టుకు వస్తారో లేదో చూడాలి..

కాగా చేతిలో డంబెల్ పట్టుకుని వర్కౌట్స్ చేస్తూ తాను చాలా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నానంటూ ఇటీవల ఒక వీడియో లో వెల్లడించారు వర్మ . కానీ, వర్మకు కరోనా వైరస్ సోకిందని ఆయన లాయర్ నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టుకు విన్నవించారు..దీనితో అందరు ఒక్కసారిగా షాక్ కు గురి అయ్యారు ..


Tags :
|
|
|
|
|

Advertisement