Advertisement

  • అనురాగ్ కశ్యప్ అలాంటివాడు కాదు..మద్దతుగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ

అనురాగ్ కశ్యప్ అలాంటివాడు కాదు..మద్దతుగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ

By: Sankar Tue, 22 Sept 2020 09:30 AM

అనురాగ్ కశ్యప్ అలాంటివాడు కాదు..మద్దతుగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ


బాలీవుడ్ లో గత కొంతకాలంగా సినిమా విజయాలు , కలెక్షన్స్ కంటే వివాదాల గురించే ఎక్కువగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది..యంగ్ హీరో సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి..నటి కంగనా రనౌత్ బాలీవుడ్ ప్రముఖుల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే..అయితే తాజాగా మరొక నటి పాయల్ ఘోష్ తనను బలవంతం చేయడానికి ప్రయత్నించాడంటూ అనురాగ్ కశ్యప్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే ..

ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు అనురాగ్ కశ్యప్ ని అరెస్ట్ చేయాలంటూ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ పెట్టి డిమాండ్ చేస్తున్నారు. నటి కంగనా రనౌత్ కూడా పాయల్ ఘోష్ కి మద్ధతు తెలుపుతూ 'మీ టూ' 'అరెస్ట్ అనురాగ్ కశ్యప్' అంటూ ట్వీట్ పెట్టింది. అయితే ఇండస్ట్రీలోని మరికొందరు మాత్రం అనురాగ్ కశ్యప్ కి సపోర్ట్ నిలుస్తున్నారు.ఇప్పటికే హీరోయిన్ రాధికా ఆప్టే అనురాగ్ కుమద్దతు తెలుపగా ఆతర్వాత తాప్సి మాట్లాడుతూ అనురాగ్ కశ్యప్ పై ఆ రోపణలు నిజం కాదని నేను భావిస్తున్నాను అంది.

తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా అనురాగ్ కు మద్దతుగా ట్వీట్ చేసారు. "అనురాగ్ కశ్యప్ ను నేను 20 ఏళ్లుగా చూస్తున్నాను. ఆయన చాలా సున్నిత మనస్కుడు. ఎవరిని కూడా బాధపెట్టే వ్యక్తిత్వం ఆయనది కాదు. ఆయన ఎప్పుడు ఎవరిని బాధ పెట్టిన సందర్బాలు లేవు." అంటూ వర్మ రాసుకొచ్చారు.



Tags :

Advertisement