Advertisement

  • కన్నడ స్టార్ ఉపేంద్ర కొత్త చిత్రం కబ్జా థీమ్ పోస్టర్ విడుదల

కన్నడ స్టార్ ఉపేంద్ర కొత్త చిత్రం కబ్జా థీమ్ పోస్టర్ విడుదల

By: Sankar Fri, 18 Sept 2020 4:29 PM

కన్నడ స్టార్ ఉపేంద్ర కొత్త చిత్రం కబ్జా థీమ్ పోస్టర్ విడుదల


డిఫరెంట్ సినిమాలతో సౌత్ లో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు కన్నడ స్టార్ ఉపేంద్ర..తాజాగా ఆయన పుట్టినరోజు (సెప్టెంబర్‌ 18) సందర్భంగా ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కబ్జా’ థీమ్‌ పోస్టర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చేతుల మీదుగా విడుదల చేయించారు.

శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని లాంకో శ్రీధర్‌ సమర్పిస్తున్నారు. ‘ఏ’, ‘ఉపేంద్ర’ తదితర చిత్రాలతో హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఉపేంద్ర. ప్రస్తుతం ఆయన హీరోగా ‘కబ్జా’ ప్యాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, ఒరియా, మరాఠీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

తెలుగులో సుధీర్‌బాబు హీరోగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాకి దర్శకత్వం వహించిన ఆర్‌.చంద్రు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Tags :
|

Advertisement