Advertisement

  • మర్డర్ సినిమా వాళ్ళ జీవిత చరిత్ర కాదు ...రామ్ గోపాల్ వర్మ

మర్డర్ సినిమా వాళ్ళ జీవిత చరిత్ర కాదు ...రామ్ గోపాల్ వర్మ

By: Sankar Sun, 08 Nov 2020 08:04 AM

మర్డర్ సినిమా వాళ్ళ జీవిత చరిత్ర కాదు ...రామ్ గోపాల్ వర్మ


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే..తన వివాదాస్పద చిత్రాలతో ఎప్పుడు అందరి నోళ్ళలో నానుతూ ఉండే వర్మ , తాజాగా ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో వరుస సినిమాలతో బిజీ బిజీ గా ఉన్నాడు ...తాజాగా అయన నుంచి వస్తున్న మరొక సినిమా మర్డర్ ..నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెత్తుతున్న ఈ సినిమాను ఆపాలని కొంతమంది కోర్ట్ లకు కూడా వెళ్లారు...

అయితే ఈ సినిమాపై వర్మ స్పందించారు నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో మొదటినుంచీ సినిమాలు తీస్తూనే ఉన్నాను. నా మొదటి సినిమా ‘శివ’ నుంచి కూడా అలానే చేశాను. ‘సర్కార్, 26/11, రక్తచరిత్ర’ సినిమాలు తీశాను. ‘మర్డర్‌’ సినిమా కూడా నిజ జీవితాల నుంచి తీసుకున్న కథాంశమే. ఏ కథ అయినా నిజజీవితం నుంచి స్ఫూర్తి పొందాల్సిందే’’ అన్నారు రామ్‌గోపాల్‌ వర్మ.

ఈ నేపథ్యంలో సినిమాను ఆపేయాలని అమృత కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ని విచారించి, తెలంగాణ హైకోర్టు సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘మర్డర్‌’ సినిమా ఫలానా వాళ్ల జీవితం అని ఎప్పుడూ చెప్పలేదు. ఒక కేసు చాలా పాపులర్‌ అయింది. అందరూ ఈ సినిమా అదే అనుకున్నారు. కానీ కాదని ఎప్పుడో చెప్పాను. కేసు పెట్టిన వాళ్ల కారణాలు వాళ్లకు ఉండొచ్చు. నాకు ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం లేదు’’ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు నట్టికుమార్, నట్టి కరుణ కూడా పాల్గొన్నారు.

Tags :
|

Advertisement