Advertisement

  • కష్టమైన రెండు వేరు వేరు టాస్కుల కోసం సిద్దమవుతున్నరామ్ చరణ్

కష్టమైన రెండు వేరు వేరు టాస్కుల కోసం సిద్దమవుతున్నరామ్ చరణ్

By: chandrasekar Mon, 05 Oct 2020 3:07 PM

కష్టమైన రెండు వేరు వేరు టాస్కుల కోసం సిద్దమవుతున్నరామ్ చరణ్


రామ్ చరణ్ నటించే రెండు సినిమాల కోసం కష్టమైన రెండు వేరు వేరు టాస్కులకు రామ్ చరణ్ సిద్దమవుతున్నాడు. కొరటాల శివ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలకమైన పాత్రలో 40 నిమిషాల పాటు కనిపించనున్నాడు. ఈ సినిమాలో చరణ్ కోసం కొరటాల శివ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ ఆచార్య మూవీ స్టోరీ వినిపించినపుడు ఒక కీలకమైన పాత్ర గురించి చెప్పాడట.

ఆచార్య సినిమాలో ఆ పాత్ర కోసం చరణ్ అయితే బాగా సరిపోతాడనిపించింది అని చిరు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అలాగే 'ఆచార్య' సినిమాలో చరణ్ నటించడానికి రాజమౌళి కూడా అనుమతి ఇచ్చారని చిరు అన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు రాంచరణ్ ముందు రెండు ఆఫర్స్ ఉన్నట్టుగానే రెండు టాస్కులు కూడా ఉన్నాయంట. అదేంటంటే ఆచార్య సినిమా కోసం రామ్ చరణ్ బరువు పెరగాలంట. అంటే ఒక సినిమాలో బరువు పెరగడమన్న మాట.

కానీ ఆచార్య కోసం బరువు పెరగడం ఒక సమస్య ఐతే మరొక సినిమా ఆర్ఆర్ఆర్ మూవీ కోసం మళ్లీ బరువు తగ్గి యధాస్థాయికి చేరుకోవడం ఇంకో పెద్ద టాస్క్ కానుంది. ఆచార్య మూవీ కోసం ఒక నెల రోజుల్లో కావలసిన బరువు పొందడం చరణ్‌కి కాస్త సవాలుగా మారింది. ఐతే చరణ్‌ను తల్లి సురేఖ తన భర్త చిరుతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నందున తల్లి కోరిక తీర్చడం కోసం చరణ్ ఈ సవాలును ఇష్టంగానే స్వీకరిస్తాడులే. మరి రెండు టాస్కులను ఎలా పూర్తి చేస్తాడో చూడాలి మరి.

Tags :

Advertisement