Advertisement

  • మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువస్తుంది ...రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్

మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువస్తుంది ...రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్

By: Sankar Wed, 09 Dec 2020 7:36 PM

మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువస్తుంది ...రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్


రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాల పట్ల అన్నదాతలు చేస్తున్న నిరసనను చూసైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు.

సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ పట్టణంలో రూ.89 లక్షలతో వేయనున్న పైపులైన్‌ పనులకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎంపీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమానికి కృషి చేస్తుంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తుందని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ను చూసైనా బీజేపీ నాయకత్వం పద్ధతి మార్చుకోవాలన్నారు. అక్కడక్కడ నాలుగు సీట్లు సాధించి ప్రజల్లో గొప్ప ఆదరణ ఉందనుకుని బీజేపీ ఎంపీలు బండి సంజయ్‌, అరవింద్‌ తమ స్థాయిని మించి మాట్లాడుతున్నారన్నారు. బీజేపీకి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

కాగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిన్న భారత బందుకు పిలుపు ఇవ్వగా తెలంగాణాలో తెరాస భారత్ బంద్ ను విజయవంతం చేసింది...వెంటనే రైతులకు వ్యతిరేకంగా నఉన్న వ్యవసాయ చట్టాలను తొలగించాలని తెరాస సీనియర్ నాయకులూ బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు

Tags :

Advertisement