Advertisement

రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు...

By: chandrasekar Mon, 12 Oct 2020 8:49 PM

రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు...


చైనాపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ ‘మిషన్’లో భాగంగానే చైనా సరిహద్దు వివాదాలను సృష్టిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. 44 బ్రిడ్జిలను ప్రారంభించిన అనంతరం ఆన్‌లైన్ కార్యక్రమంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. భారత్ సరిహద్దు సమస్యలను ఎదుర్కొంటూనే, సరిహద్దులు సహా వివిధ ప్రాంతాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ‘ఉత్తర, తూర్పు సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులను సృష్టిస్తున్నారో మీకు తెలియంది కాదు. తొలుత పాకిస్థాన్ ఆ పని చేయగా, ఇప్పుడు చైనా కూడా అదే పనిచేస్తోంది. ఓ ప్రత్యేక లక్ష్యం తో చైనా సరిహద్దు వివాదాలను సృష్టిస్తున్నట్టు అనుమానంగా ఉంది. మనకు ఈ రెండు దేశాలతో 7 వేల కిలోమీటర్ల సరిహద్దు ఉంది’’ అని రాజ్‌నాథ్ వివరించారు.

భారత్, చైనా సరిహద్దు వద్ద గత ఐదు నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఇరు దేశాల సైనికుల స్టాండాఫ్ కొనసాగుతోంది. ఉద్రిక్తతల సడలింపు కోసం ఇరు దేశాల మధ్య వరుసగా దౌత్య, సైనిక చర్చలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఉద్రిక్తతలకు తెరపడడం లేదు.

Tags :
|

Advertisement