Advertisement

  • చైనాతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ అధికారులకు సూచ‌న‌

చైనాతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ అధికారులకు సూచ‌న‌

By: chandrasekar Thu, 29 Oct 2020 4:45 PM

చైనాతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ అధికారులకు సూచ‌న‌


స‌రిహ‌ద్దుల్లో భార‌త్‌, చైనా సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగిన‌ప్ప‌టి నుంచి ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. దీంతో ఇరుదేశాల క‌మాండ‌ర్ స్థాయి అధికారుల మ‌ధ్య ద‌ఫ‌ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చ‌ర్చ‌ల విషయంలో చైనాతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆర్మీ అధికారులకు సూచించారు. చైనాతో మ‌రోసారి చర్చలు జ‌రుగ‌నున్న‌ నేప‌థ్యంలో రాజ్‌నాథ్‌సింగ్ అక్క‌డ చ‌ర్చించాల్సిన అంశాల‌పై ఆర్మీ ఉన్నతాధికారులతో మాట్లాడారు.

చర్చలు జరిగే సమయంలో అత్యంత నిజాయితీగా వ్యవహరించాలని, అత్యంత నమ్మకమైన వాతావరణంలో ఆ చర్చలు జరగాలని పేర్కొన్నారు. చైనా నమ్మకంగా వ్యవహరించడం లేదని, వారి ఉద్దేశం కూడా అస్పష్టంగా, ప్రశ్నార్థకంగా ఉందని ఆర్మీ అధికారులతో రాజ్‌నాథ్ వ్యాఖ్యానించిన‌ట్లు సమాచారం. చైనాతో ఘర్షణ ఏర్పడిన సమయంలో భారత జవాన్లు స్పందించిన తీరు అద్భుతంగా ఉందని, అలాగే చలి కాలంలోనూ అంతే తెగువ చూపిస్తూ ఆర్మీ విధులు నిర్వర్తిస్తున్న‌ద‌ని రాజ్‌నాథ్ ప్రశంసించారు.

Tags :
|

Advertisement