Advertisement

  • ర‌జ‌నీకాంత్ కు మ‌ద్రాస్ హైకోర్టులో చుక్కెదురు..

ర‌జ‌నీకాంత్ కు మ‌ద్రాస్ హైకోర్టులో చుక్కెదురు..

By: chandrasekar Wed, 14 Oct 2020 8:38 PM

ర‌జ‌నీకాంత్ కు మ‌ద్రాస్ హైకోర్టులో చుక్కెదురు..


ప్ర‌ముఖ సినీ న‌టుడు ర‌జ‌నీకాంత్ కు మ‌ద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. కొడంబాక్క‌మ్ లో తాను నిర్మించిన‌ రాఘ‌వేంద్ర కల్యాణ‌ మండ‌పానికి ట్యాక్స్ చెల్లించాల‌ని గ్రేట‌ర్ చెన్నై మున్సిప‌ల్ కార్పోరేష‌న్ డిమాండ్ చేయడాన్ని స‌వాలు చేస్తూ ర‌జ‌నీకాంత్ మ‌ద్రాస్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

అయితే తాజాగా ఈ విష‌యంలో మ‌ద్రాస్ హైకోర్టు ర‌జ‌నీకాంత్ కు హెచ్చ‌రిక చేసింది. ట్యాక్స్ చెల్లింపు డిమాండ్ కు వ్య‌తిరేకంగా కోర్టును ఆశ్ర‌యించినందుకు జ‌రిమానా విధించాల్సి ఉంటుంద‌ని ర‌జ‌నీకాంత్ ను కోర్టు హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో త‌మ కేసును విత్ డ్రా చేసుకునేందుకు స‌మ‌యం ఇవ్వాల‌ని ర‌జ‌నీకాంత్ త‌ర‌పు లాయ‌ర్ కోర్టును కోరారు.

కొడంబాక్క‌మ్ లోని శ్రీ రాఘ‌వేంద్ర‌ కల్యాణ‌ మండ‌పం 2020 మార్చి 24న క‌రోనా వైర‌స్ కార‌ణంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించిన‌ప్పుడే మూసివేశాం. ఆ త‌ర్వాత కల్యాణ‌ మండ‌పం ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ఆదాయం రాలేద‌ని ర‌జనీకాంత్ పిటిష‌న్ లో పేర్కొన్నట్టు స‌మాచారం. కానీ గ్రేట‌ర్ చెన్నై కార్పోరేష‌న్ అధికారులు అర్థ‌వార్షిక ప‌ద్ద‌తిలో ఏప్రిల్‌-సెప్టెంబ‌ర్ వ‌ర‌కు 6 నెల‌ల కాలానికి రూ.6.50 ల‌క్ష‌లు ట్యాక్స్ చెల్లించాల‌ని డిమాండ్ చేశారు.

Tags :
|

Advertisement