Advertisement

  • రజినీకాంత్ తన కొత్త పార్టీ ‘మక్కల్ సేవై కక్షి'...పార్టీకి ఆటో గుర్తు…?

రజినీకాంత్ తన కొత్త పార్టీ ‘మక్కల్ సేవై కక్షి'...పార్టీకి ఆటో గుర్తు…?

By: chandrasekar Tue, 15 Dec 2020 6:10 PM

రజినీకాంత్ తన కొత్త పార్టీ  ‘మక్కల్ సేవై కక్షి'...పార్టీకి ఆటో గుర్తు…?


రజినీకాంత్ తన కొత్త పార్టీకి ‘మక్కల్ సేవై కక్షి' దీని అర్ధం ప్రజాసేవ పార్టీ అని, ఈ పేరు దాదాపు ఫిక్స్ చేసినట్లు సమాచారం. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పార్టీ పనులను వేగంగా సాగుతున్నాయి. ఈ నెల 31న పార్టీ పేరును ప్రకటిస్తానని తెలిపారు. కొత్త పార్టీకి సూపర్‌వైజర్‌గా తమిళ్రూవి మణియనణ్‌ను, చీఫ్‌ కోఆర్డినేటర్‌గా అర్జున మూర్తిని నియమి౦చారు. పార్టీ పేరు, జెండా, ఇతర విషయాలపై ముఖ్యనేతలతోనూ సమావేశం నిజరిపారు.

కొత్త పార్టీకి ‘మక్కల్ సేవై కక్షి' అని, అలాగే పార్టీకి ఆటో గుర్తును ఎలక్షన్‌ కమిషన్‌ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. రజనీకాంత్‌ నటించిన భాషా సినిమాలో ఆటో డ్రైవర్‌గా‌ కనిపించారు. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ఆయనకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన తన ఎన్నికల గుర్తుగా ఆటోను ఎంచుకున్నట్లు సమాచారం. పార్టీ పేరు, జెండా, ఇతర విషయాలను రజనీకాంత్‌ ఈ నెలాఖరున స్వయంగా ప్రకటించనున్నారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో రజినీకాంత్ పార్టీ ‘మక్కల్ సేవై కక్షి’ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు టాక్.

Tags :
|
|

Advertisement