Advertisement

  • బిగ్ బ్రేకింగ్ న్యూస్ ..రాజకీయాల్లోకి రావట్లేదు అని ప్రకటించిన తలైవా రజినీకాంత్

బిగ్ బ్రేకింగ్ న్యూస్ ..రాజకీయాల్లోకి రావట్లేదు అని ప్రకటించిన తలైవా రజినీకాంత్

By: Sankar Tue, 29 Dec 2020 12:41 PM

బిగ్ బ్రేకింగ్ న్యూస్ ..రాజకీయాల్లోకి రావట్లేదు అని ప్రకటించిన తలైవా రజినీకాంత్


సూపర్ స్టార్ రజినీకాంత్ మరొకసారి తన అభిమానులకు షాకిచ్చాడు..ఇప్పటికే రజిని రాజకీయ ప్రవేశంపై అనేక చర్చలు జరగగా ఇటీవలే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు డిసెంబర్ 31 న పార్టీని ప్రకటించబోతున్నట్లు రజిని ప్రకటించారు...అయితే ఈ రోజు రిలీజ్ చేసిన ప్రకటనలో ఈ నెల 31 న పార్టీ ప్రకటన లేదని స్పష్టం చేశారు.. అనారోగ్య కారణాల దృష్ట్యా పాలిటిక్స్ కి తాను దూరంగా ఉంటున్నానని క్లారిటీ ఇచ్చారు.

తనపై నమ్మకం ఉంచిన వ్యక్తులను బలిపశువుగా భావించడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు రజనీకాంత్.. తన ఆరోగ్య పరిస్థితిపై ఇటీవలి జరిగిన పరిణామాలు దేవుని హెచ్చరికగా తీసుకుంటానని, 2021 తమిళనాడు ఎన్నికల్లో రాజకీయ ప్రయాణానికి తన ప్రణాళికలతో ముందుకు సాగలేనని తెలిపారు.. అధిక రక్తపోటుతో బాధపడుతూ చికిత్స పొంది.. హైదరాబాద్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రెండు రోజుల తర్వాత రజనీకాంత్ చేసిన ప్రధాన ప్రకటన ఇదే..

దీనితో తమ ఆరాధ్య దైవం రజినీకాంత్ నుంచి పార్టీ ప్రకటన వార్త కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురయింది...దీనితో ఎన్నో ఏళ్లుగా రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలకు ఇక ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడింది...

Tags :

Advertisement