Advertisement

  • స్వల్ప లక్ష్య ఛేదనను అందుకోలేక ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన రాజస్థాన్ రాయల్స్

స్వల్ప లక్ష్య ఛేదనను అందుకోలేక ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన రాజస్థాన్ రాయల్స్

By: chandrasekar Thu, 15 Oct 2020 08:18 AM

స్వల్ప లక్ష్య ఛేదనను అందుకోలేక ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన రాజస్థాన్ రాయల్స్


చిన్న లక్ష్యాన్ని అందుకోలేక ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడింది. ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన 30వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 13 పరుగుల తేడాతో గెలుపొంది మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేసింది. 162 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే ఓడింది. ఢిల్లీ విధించిన లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఢిల్లీ బౌలర్ల ధాటికి రాజస్థాన్ రాయల్స్ నిలిచి గెలవలేకపోయింది. ఢిల్లీ ఆటగాళ్లలో ఓపెనర్‌ పృధ్వీషా తొలి బంతికే డకౌట్ కాగా మరో ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (57 పరుగులు; 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు.

ఓపెనింగ్ వికెట్ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అజింక్య రహానే సైత్ 2 పరుగులకే పెవిలియన్ బాటపట్టగా ఆ తర్యాత బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టేన్ శ్రేయాస్‌ అయ్యర్‌ (53 పరుగులు; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మార్కస్ స్టొయినిస్ (18), అలెక్స్ కెరీ (14), అక్షర్ పటేల్ (7) పరుగులు చేశారు. రాజస్థాన్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ (3/19) ఢిల్లీని తక్కువ స్కోర్‌కి పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఓపెనర్‌ బెన్‌స్టోక్స్‌ (41 పరుగులు; 35 బంతుల్లో 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌‌గా నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో రాబిన్ ఊతప్ప ( 32 పరుగులు; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), సంజు శాంసన్ ( 22 పరుగులు; 18 బంతుల్లో 2 ఫోర్లు), జోస్ బట్లర్ ( 22 పరుగులు; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే (2/37), నోర్ట్జే(2/33) రాణించారు. నోర్జే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్ల్లో నోర్జే అత్యంత వేగవంతమైన బంతులను విసిరాడు.

Tags :
|

Advertisement