Advertisement

  • తేవాటియా , రియాన్ పరాగ్ రాయల్ షో ...సన్ రైజర్స్ పై రాజస్థాన్ సంచలన విజయం

తేవాటియా , రియాన్ పరాగ్ రాయల్ షో ...సన్ రైజర్స్ పై రాజస్థాన్ సంచలన విజయం

By: Sankar Mon, 12 Oct 2020 06:46 AM

తేవాటియా , రియాన్ పరాగ్ రాయల్ షో ...సన్ రైజర్స్ పై రాజస్థాన్ సంచలన విజయం


ఐపీయల్ ౨౦౨౦ లో యువ ఆటగాళ్లు తమ జోరు కొనసాగిస్తున్నారు ..సీనియర్ ఆటగాళ్లు అంతగా రాణించలేకపోతున్న యువ ఆటగాళ్లు మాత్రం రెచ్చిపోతున్నారు..నిన్న సన్ రీసెర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో తక్కువ పరుగులకే ప్రధాన బాట్స్మెన్ అందరు అవుట్ అయి పోయినప్పటికీ రాజస్థాన్ యువ ఆటగాళ్లు అయిన రాహుల్ తేవాటియా , రియాన్ పరాగ్ సంచలన ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంచలన విజయాన్ని అందించారు..రాహుల్ తేవాటియా తాను వన్ మ్యాచ్ వండర్ కాదు అని నిరూపించుకుంటూ మరొక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు..

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (44 బంతుల్లో 54; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో మెరిశాడు. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (38 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. విలియమ్సన్‌ (12 బంతుల్లో 22 నాటౌట్‌; 2 సిక్సర్లు), ప్రియమ్‌ గార్గ్‌ (8 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్‌) వేగంగా ఆడారు.

అనంతరం ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాహుల్‌ తేవటియా (28 బంతుల్లో 45 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్‌ పరాగ్‌ (26 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో రాజస్తాన్‌ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు సాధించింది. వీరిద్దరూ అజేయంగా ఆరో వికెట్‌కు 85 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఖలీల్, రషీద్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

అందివచ్చిన అవకాశాన్ని వదులుకుంటే ఒక్కోసారి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు ఈ అనుభవం ఎదురైంది. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్‌ మూడో బంతికి రియాన్‌ పరాగ్‌ భారీ షాట్‌ ఆడగా బంతి గాల్లోకి లేచింది. డీప్‌ మిడ్‌వికెట్‌లో ప్రియమ్‌ గార్గ్‌ క్యాచ్‌ను వదిలేశాడు. దాంతో పరాగ్‌ బతికిపోయాడు. అప్పటికి పరాగ్‌ 12 పరుగులతో ఉన్నాడు. ఒకవేళ పరాగ్‌ క్యాచ్‌ను గార్గ్‌ పట్టిఉంటే సన్‌రైజర్స్‌కు తుది ఫలితం మరోలా ఉండేదేమో.

Tags :
|

Advertisement