Advertisement

  • మిడతల వల్ల రాజస్థాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది

మిడతల వల్ల రాజస్థాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది

By: chandrasekar Sat, 23 May 2020 5:35 PM

మిడతల వల్ల రాజస్థాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది


ఏటా జూన్-జూలై నెలల్లో మిడతల దండు పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తుంది. కానీ ఈసారి ముందుగానే రావడంతో పంటలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లుతోంది. ఈ మిడతల దండు మధ్యప్రదేశ్‌లోని 15 జిల్లాల్లోకి కూడా ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది. మిడత వల్ల గతేడాది రాజస్థాన్‌లో 6.7 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. మిడతల వల్ల 2019లో వెయ్యి కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లిందని రాజస్థాన్ ప్రభుత్వం అంచనా వేసింది. మిడతల దండును కట్టడి చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తోన్న రాజస్థాన్ ఈ కీటకాలను నియంత్రించండానికి డ్రోన్లను సమకూర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది.

rajasthan,severely,damaged,locusts,environment ministry ,మిడతల,  రాజస్థాన్‌కు, తీవ్ర నష్టం, వాటిల్లిందని,  పర్యావరణ మంత్రిత్వ శాఖ


జైపూర్‌ను దాటేసిన మిడతల దండు ఢిల్లీ దిశగా వెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రాజస్థాన్‌లో వ్యవసాయ భూములు ప్రస్తుతం చాలా వరకు ఖాళీగా ఉండటంతో హర్యానా వైపుగా మిడతలు పయనిస్తున్నాయి. జైసల్మేర్ ప్రాంతం గుండా మిడతలు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని వరకు వ్యాపించాయి. గుజరాత్‌లోని బనస్కథ ఏరియా కూడా మిడతల దాడికి గురైంది. రాజస్థాన్‌లోనే మిడతలను నిలువరించలేకపోతే వారం రోజుల్లో ఢిల్లీకి చేరుకుంటాయని రాజస్థాన్‌కు చెందిన ఓ రైతు నాయకుడు హెచ్చరించారు. మధ్య ఆసియాలోని వాతావరణ పరిస్థితుల కారణంగా మిడతలు అంతర్జాతీయ సమస్యగా పరిణమించాయి. తూర్పు ఆఫ్రికా, ఇరాన్, పాకిస్థాన్, భారత్‌లకు మిడతలతో ముప్పు పొంచి ఉంది. 2019లో వచ్చిన మిడతల గుంపుల కంటే మూడింతలు పెద్ద మిడతల దండు రాజస్థాన్‌లోకి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

Tags :

Advertisement