Advertisement

  • కరోనా మృతుల అంత్యక్రియల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న రాజస్థాన్ ప్రభుత్వం

కరోనా మృతుల అంత్యక్రియల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న రాజస్థాన్ ప్రభుత్వం

By: Sankar Tue, 08 Sept 2020 12:20 PM

కరోనా మృతుల అంత్యక్రియల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న రాజస్థాన్ ప్రభుత్వం


దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి..రోజుకు 90 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయితున్నాయి..అయితే మరణాలు కూడా అదే స్థాయిలో నమోదు అయితున్నాయి.ఇప్పటి వరకు కరోనాబారినపడి మృతిచెందారంటే ఆస్పత్రి సిబ్బందే నేరుగా వచ్చి అంత్యక్రియలు పూర్తి చేసి వెళ్లిపోతుంటారు. స్థానిక అధికారులు వీటిని పర్యవేక్షిస్తారు.

అయితే కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండడంతో రాజస్థాన్ సర్కార్ కరోనా మృతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కరోనా మృతులకు కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. రాజస్థాన్ సర్కార్ నిర్ణయం ప్రకారం.. కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాల్సి ఉంటుంది. అయితే, దీనికోసం ప్రత్యేకంగా ప్రోటోకాల్‌ ఉంటుంది.

ప్రోటోకాల్‌ ప్రకారం.. మృత దేహాలను ప్యాక్‌చేసి, కుటుంబ సభ్యులకు అప్పగించాలి.. ఆ తర్వాత మృతదేహాలకు స్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవచ్చు. అయితే సరైన జాగ్రత్తలతో అంత్యక్రియలు నిర్వహిస్తే కరోనా వేరే వారికీ పాకే అవకాశం ఉండకపోవడంతో రాజస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది..

Tags :
|
|

Advertisement