Advertisement

ముంబైపై విజయంతో రాజస్థాన్ ఆరో స్థానం..

By: chandrasekar Mon, 26 Oct 2020 10:06 AM

ముంబైపై విజయంతో రాజస్థాన్ ఆరో స్థానం..


ఐపీఎల్ కీలక దశకు చేరిన వేళ... చివరి స్థానాల్లో నిలిచిన జట్లు టాప్-3 జట్లకు షాకిస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించగా.. ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. ముంబై నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో చేధించిన రాజస్థాన్ రాయల్స్.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది. రాజస్థాన్ చేతిలో ఓడినప్పటికీ ముంబై అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ఢిల్లీ, బెంగళూరు జట్లు రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. 11 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగో స్థానంలో నిలవగా... వరుసగా నాలుగు విజయాలు సాధించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐదో స్థానం దక్కించుకుంది.

రాజస్థాన్ విజయంతో సన్‌రైజర్స్ ఆరోస్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయింది. ముంబైపై విజయం సాధించినప్పటికీ.. మైనస్ నెట్ రన్ రేట్ కారణంగా చెన్నై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఐపీఎల్‌లో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన విషయానికి వస్తే.. 567 రన్స్‌తో కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలవగా.. శిఖర్ ధావన్ (471), విరాట్ కోహ్లి (415) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 11 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీసిన ఢిల్లీ బౌలర్ కగిసో రబాడ పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉండగా.. 17 వికెట్ల చొప్పున తీసిన ఆర్చర్, బుమ్రా, షమీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Tags :
|

Advertisement