Advertisement

  • ముంబై ఇండియన్స్ పై సంచలన విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్

ముంబై ఇండియన్స్ పై సంచలన విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్

By: Sankar Mon, 26 Oct 2020 09:44 AM

ముంబై ఇండియన్స్ పై సంచలన విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్


ఈ సీజన్‌లో అడపా దడపా విజయాలతో ఢీలా పడ్డ రాజస్తాన్‌ రాయల్స్‌.. ఎట్టకేలకు భారీ విజయాన్ని సాధించింది. ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్తాన్‌ సునాయాసంగా ఛేదించింది. తమ బ్యాటింగ్‌లో పవర్‌ చూపెట్టిన రాజస్తాన్‌.. ముంబై ఇండియన్స్‌ను రప్ఫాడించింది.

బెన్‌ స్టోక్స్‌(107 నాటౌట్‌; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ శాంసన్‌(54 నాటౌట్‌; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స్‌లు)లు చెలరేగిపోవడంతో రాజస్తాన్‌ 18.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది.ఈ జోడి అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో రాజస్తాన్‌ అలవోకగా జయకేతనం ఎగురవేసింది.

టార్గెట్‌ ఛేదనలో రాబిన్‌ ఊతప్ప(13;11 బంతుల్లో 2 ఫోర్లు)వికెట్‌ను రాజస్తాన్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. అనంతరం స్టీవ్‌ స్మిత్‌(11; 8 బంతుల్లో 1 ఫోర్‌, 1సిక్స్‌) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేదు. ఆ తరుణంలో బెన్‌ స్టోక్స్‌కు జత కలిసిన శాంసన్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డ వీరిద్దరూ రాజస్తాన్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు.

స్టోక్స్‌ 59 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. పాటిన్‌సన్‌ వేసిన 19 ఓవర్‌లో తొలి రెండు బంతుల్ని సిక్స్‌, ఫోర్‌లు కొట్టిన స్టోక్స్‌ విజయాన్ని ఖాయం చేశాడు. ఇది రాజస్తాన్‌కు ఐదో విజయం కాగా, ముంబైకు నాల్గో ఓటమి. ఈ విజయంతో రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది..ఈ మ్యాచ్ లో ఓడిన కూడా ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలోనే ఉంది..

Tags :
|
|

Advertisement