Advertisement

రాజశేఖర్‌ ఆరోగ్యం స్థిరంగా ఉంది...జీవిత

By: chandrasekar Fri, 23 Oct 2020 3:24 PM

రాజశేఖర్‌ ఆరోగ్యం స్థిరంగా ఉంది...జీవిత


ఇటీవల హీరో రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. మిగిలిన వారు కోలుకున్నప్పటికీ రాజశేఖర్‌కు చికిత్స కొనసాగుతోంది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో రాజశేఖర్ భార్య జీవిత స్పందించారు. ‘‘ప్రస్తుతం రాజశేఖర్‌ ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. దయచేసి అసత్యవార్తలను ప్రచారం చేయొద్దు’’ అని ఆమె విజ్ఞప్తి చేసారు. అయితే రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని సిటీ న్యూరో సెంటర్ పేర్కొంది. రాజశేఖర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్ అవసరం లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపింది.

గురువారం ఉదయం కుమార్తె శివాత్మిక ట్వీట్ చేస్తూ కరోనాతో రాజశేఖర్ పోరాటం కాస్త కష్టంగా మారిందని తెలియజేశారు. అయినా తన తండ్రి ధైర్యంగానే పోరాడుతున్నారని ఆమె తెలిపారు. ‘‘మీ ప్రార్థనలు, ప్రేమ, మద్దతు మమ్మల్ని కాపాడతాయని మేం బలంగా నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి. మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారు’’ అని ట్విట్టర్ ద్వారా శివాత్మిక పేర్కొన్నారు.

Tags :
|
|
|

Advertisement