Advertisement

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రాజశేఖర్‌...

By: chandrasekar Tue, 10 Nov 2020 2:53 PM

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రాజశేఖర్‌...


తెలుగు ఇండస్ట్రీలో కరోనా వైరస్ విళయతాండవం చేయడం చూస్తూనే ఉన్నాము. హీరో చిరంజీవికి తాజాగా కరోనా వచ్చింది. అయితే ఈయన కంటే ముందుగానే సీనియర్ హీరో రాజశేఖర్ కూడా కరోనా బారిన పడ్డాడు. గత కొన్ని రోజులుగా ఈయన సిటీ న్యూరో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. ఈయన దాదాపు 2 వారాలుగా అక్కడే ఉన్నాడు.

ఒకానొక సమయంలో నటుడు రాజశేఖర్ పరిస్థితి విషమంగా కూడా మారిపోయింది. ఆయనతో పాటు కుటుంబం అంతా కరోనా బారిన పడ్డారు. అయితే కూతుళ్లు శివానీ, శివాత్మిక రాజశేఖర్‌తో పాటు జీవిత కూడా త్వరలోనే కరోనా నుంచి కోలుకున్నారు. అయితే రాజశేఖర్ మాత్రం కోలుకోలేదు. కొన్ని రోజుల నుంచి ఈయనకు వైద్యుల సమక్షంలో చికిత్స కొనసాగుతుంది. జీవిత కూడా ఎప్పటికప్పుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇస్తుంది. ఆ మధ్య ఈయన్ని వెంటిలేటర్‌పై కూడా ఉంచారు వైద్యులు.

పరిస్థితి చేదాటిపోయిందేమో అని భయపడ్డామని జీవిత చెప్పింది. అలాంటి పరిస్థితి నుంచి ఆయన కోలుకున్నాడు.. కరోనాతో యుద్ధం చేసాడు.. ప్రాణం కోసం పోరాడి మహమ్మారిని గెలిచాడు. నవంబర్ 9న ఈయన్ని సిటీ న్యూర్ సెంటర్ హాస్పిటల్ నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేసారు.

ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకుంది జీవిత. ఇక రాజశేఖర్ కూడా హాస్పిటల్ లో ఉన్న వాళ్లతో ఫోటోలు దిగాడు. తన తన ఆరోగ్యం కోసం శ్రమించిన వైద్యులకు, నర్సులకు, వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపాడు రాజశేఖర్. సిటీ న్యూరో సెంటర్ తమకు చాలా సాయపడిందని జీవిత తెలిపింది. వాళ్లే లేకపోయుంటే ఈ రోజు తమకు చాలా ఇబ్బందులు వచ్చేవని జీవిత చెప్పింది. రాజశేఖర్ ప్రాణాలు కాపాడిన వైద్యులకు ఆమె మనస్పూర్థిగా కృతజ్ఞతలు తెలిపింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఇండస్ట్రీ నుంచి కూడా ఆయన సన్నిహితులు కోరుకున్నారు. రాజశేఖర్‌ డిశ్చార్జి కావడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags :
|

Advertisement