Advertisement

  • కరోనా కారణంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ విషయం లో షాకింగ్ నిర్ణయం తీసుకున్న రాజమౌళి

కరోనా కారణంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ విషయం లో షాకింగ్ నిర్ణయం తీసుకున్న రాజమౌళి

By: Sankar Sat, 06 June 2020 4:19 PM

కరోనా కారణంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ విషయం లో షాకింగ్ నిర్ణయం తీసుకున్న రాజమౌళి

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సినిమాలతో గుర్తింపు పొందిన దర్శకుడు రాజమౌళి..బాహుబలి రెండు సినిమాలు కూడా అత్యంత ఘన విజయాలు సాధించడంతో రాజమౌళి తీసి నెక్స్ట్ సినిమా మీద అతి భారీ అంచనాలు ఉన్నాయి ..అయితే ఆ అంచనాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఈ సారి ఏకంగా టాలీవుడ్ లో ఇద్దరు అగ్ర హీరోలు అయిన రాంచరణ్ ఎన్టీఆర్ లతో ఆర్ ఆర్ ఆర్ మూవీ కి శ్రీకారం చుట్టాడు ..అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే కరోనా రావడంతో షూటింగ్ ఆగిపోయింది..

rajamouli,ram charan,ntr,rrr,tollywood , బాహుబలి ,రాంచరణ్,  ఎన్టీఆర్, టాలీవుడ్ , కరోనా, రాజమౌళి

ఈ కల్లోల పరిస్థితుల్లో తన లేటెస్ట్ మూవీ బడ్జెట్ తగ్గించాలని ప్లాన్ చేస్తున్నారట. గతంలో భారీ సినిమాలు రూపొందించి అంతకు రెండింతలు లాభాలు తీసుకొచ్చినప్పటికీ ఇలాంటి పరిస్థితుల నడుమ నిర్మాతలను సేవ్ చేయాలని ఆయన భావిస్తున్నారట. ఈ క్రమంలోనే తన మూవీ బడ్జెట్ కోతపై దృష్టి పెట్టారట. ఇందులో భాగంగా ప్రొడక్షన్ బడ్జెట్‌లో ఎలాంటి మార్పు లేకుండా నటీనటుల రెమ్మ్యూనరేషన్ పరంగా కాస్త కొత్త పెట్టాలని చూస్తున్నారట. ఇలా అయితేనే ఔట్‌పుట్‌పై ప్రభావం పడదని, బడ్జెట్ కోతలో రెమ్మ్యూనరేషన్ తగ్గించుకోవడమే ముఖ్య సూత్రమని ఆయన తన యూనిట్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. తప్పని పరిస్థితుల్లో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్.

డీవీవీ దానయ్య నిర్మాణంలో ఈ ఆర్ ఆర్ ఆర్ ను సినిమా రూపొందిస్తున్నారు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకుంటోంది. ఇప్పటికే చాల పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్ షూటింగ్స్ రీ ఓపెన్ కాగానే మిగిలిన భాగం షూట్ చేయాలని ప్లాన్ చేస్తోంది.

Tags :
|
|

Advertisement