Advertisement

  • ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన జక్కన్న రాజమౌళి

ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన జక్కన్న రాజమౌళి

By: Sankar Mon, 05 Oct 2020 5:35 PM

ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన జక్కన్న రాజమౌళి


దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిషాత్మక చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ , ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నసినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో మన్యంవీరుడు అల్లూరి సీతారామ రాజుగా రాంచరణ్ నటిస్తుండగా..గిరిజన వీరుడు కొమరం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన 70శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. క‌రోనా వ‌ల్ల సినిమా షూటింగ్ ఆగింది. జులైలో మొదలు పెడదామనుకుంటే .. ఆ తర్వాత రాజమౌళి కరోనా బారిన పడటం వల్ల మరోసారి వాయిదా పడింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రామ్ చరణ్ టీజర్ రిలీజ్ కాగా ఆ టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఎన్టీఆర్ టీజర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. దాదాపు ఏడూ నెలల తర్వాత జక్కన సెట్లో అడుగు పెట్టారు. ఇక నుంచి శరవేగంగా షూటింగ్ ను నిర్వహించాలని రాజమౌళి భావిస్తున్నాడు.

హైదరాబాద్ శివారులో ఉన్న అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను నేటి నుండి ప్రారంభించారు. మొదటి మూడు రోజులు టెస్ట్ షూట్ జరుగనుందట. ఆ తర్వాత ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. ఎన్టీఆర్ పై ప్రోమో వీడియోను చిత్రీకరించడంతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట.

Tags :
|

Advertisement