Advertisement

గో రక్షణ నా ధర్మం ..నా కర్తవ్యం ...రాజా సింగ్

By: Sankar Mon, 21 Dec 2020 5:39 PM

గో రక్షణ నా ధర్మం ..నా కర్తవ్యం ...రాజా సింగ్


బీజేపీ శాసన సభా పక్షనేత రాజా సింగ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గో రక్షణ కార్యాలయంలో రాజ సింగ్ పాల్గొన్నారు. గో రక్షణలో తమకు అడ్డు వస్తే సొంత పార్టీనైనా తొక్కేస్తానని రాజ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గో రక్షణ కోసం గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటే పార్టీ ఒప్పుకోలేదని ఉన్న ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేస్తే కష్ణమని పార్టీ పెద్దలు బ్రతిమలాడారని అన్నారు. గోమాత నా తల్లి.. గోరక్షణ నాధర్మం.. నా కర్తవ్యం అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రతి ఒక్క ఆవును హిందువులు కాపాడుకోవాలన్న ఆయన హిందూ ధర్మం.. గోరక్షణ కోసం ఎంత వరకైనా వెళ్తానని అన్నారు. పార్టీనైనా.. పదవినైనా గోరక్షణ కోసం కాళ్ళకింద తొక్కేస్తానని ఆయన అన్నారు. ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పదవులు నాకు లెక్క కాదని అన్నారు.

Tags :
|

Advertisement