Advertisement

ఆకట్టుకుంటున్న ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్

By: Sankar Mon, 28 Sept 2020 4:25 PM

ఆకట్టుకుంటున్న ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్


రాజ్ తరుణ్ హీరోగా 'ఒరేయ్ బుజ్జిగా' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్ నిర్మించారు.

ఈ చిత్రంలో మాళవిక అయ్యర్ - హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమా త్వరలో ఓటీటీ వేదికగా విడుదల కానుంది అక్టోబర్ 2 న ఆహా లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్ . ఈ చిత్ర ట్రైలర్ ని యువసామ్రాట్ నాగచైతన్య విడుదల చేశాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.

వాణీ విశ్వనాథ్ , సీనియర్ నరేష్ , పోసాని కృష్ణమురళి , అనీష్ కురువిళ్ళ , సప్తగిరి , రాజారవీంద్ర , అజయ్ ఘోష్ , సత్యం రాజేష్ , సత్య ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఐ. ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు.ఈ ట్రైలర్ పైమీరు ఓ లుక్కేయండి .

Tags :

Advertisement