Advertisement

  • వలస కూలీలను అవమానించిన రైల్వే అధికారి సస్పెండ్

వలస కూలీలను అవమానించిన రైల్వే అధికారి సస్పెండ్

By: Sankar Sun, 31 May 2020 3:07 PM

వలస కూలీలను అవమానించిన రైల్వే అధికారి సస్పెండ్

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడంతో వలస కూలీలా బతుకులు దుర్భరంగా తయారు అయ్యాయి ..చేయడానికి పనిలేక , తినడానికి తిండి లేక అవస్థలు పడ్డారు ..అయితే వలస కూలీలను తమ సొంత ప్రాంతాలకు చేర్చేందుకు కేంద్రం శ్రామిక రైలు పేరిట రైళ్లను నడుపుతుంది ..అయితే ఈ రైళ్లలో వెళ్లే వారిపట్ల కొందరు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు ..ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన అలాంటి ఒక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

డికె దీక్షిత్‌ ఫిరోజాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చీఫ్‌ టికెట్‌ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా గత సోమవారం దీక్షిత్‌ పుట్టినరోజు సందర్భంగా తన టీంతో కలిసి ఫిరోజాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అయితే దీక్షిత్‌ పుట్టినరోజు సందర్భంగా బిస్కెట్‌ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇంతలో వలసకూలీలకు సంబంధించిన శ్రామిక్‌రైలు అక్కడికి చేరుకొంది.దీక్షిత్‌ వారికి కూడా బిస్కెట్‌ ప్యాకెట్లు ఇవ్వాలని తన టీంకు తెలిపాడు.


corona,lockdown,migrant,shramik,train,suspend ,ఫిరోజాబాద్‌ , శ్రామిక్‌రైలు, చీఫ్‌ టికెట్‌ ఇన్స్‌పెక్టర్‌,బిస్కెట్‌ ప్యాకెట్లు ,వలసకూలీ

అయితే టీం సభ్యులు బిస్కెట్‌ పాకెట్లను వారి చేతికి అందివ్వకుండా బిస్కెట్‌ పాకెట్లను చింపి ఒక్కో బిస్కెట్‌ను కంపార్ట్‌మెంట్‌లోకి విసిరారు. ఈ సందర్భంగా దీక్షిత్‌ టీంలోని సభ్యుడు గట్టిగా అరుస్తూ..' ఈరోజు మా సార్‌ దీక్షిత్‌ పుట్టినరోజు. అందుకే బిస్కెట్లు పంచుతున్నాం' అంటూ పేర్కొన్నాడు. అయితే వలస కూలీలు మరికొన్ని బిస్కెట్‌ పాకెట్లు ఇవ్వాలని కోరితే మీకు ఇచ్చిన దాంట్లోనే సరిపెట్టుకొండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అంతేగాక కిందపడిన బిస్కెట్లు వేస్ట్‌ కాకుండా తీసుకొని తినేయండి అంటూ వలసకూలీల పట్ల అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఇదంతా రైల్వే స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇది కాస్తా అక్కడి లోకల్‌ ఆఫీసర్‌ తన వాట్సప్‌ గ్రూఫ్‌లో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది

విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు దీక్షిత్‌తో పాటు అతనితో ఉన్న టీమ్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది.వలసకూలీలపై అవమానకరంగా ప్రవర్తించడంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ తన ట్విటర్‌లో పేర్కొంది. సరిగ్గా వారం కిందట ఓల్డ్‌ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆహరం కోసం వలసకూలీలు ఒకరిని ఒకరు తోసుకున్న సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం ఈ ఘటనపై సుప్రీంకోర్టు స్పందించింది. వలసకూలీలపై వివక్ష చూపిస్తూ రైల్వే అధికారులు ఇలా చేయడం దారుణం అని అభివర్ణించింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్‌ రైల్వేశాఖ అధికారులను కోరింది.



Tags :
|
|

Advertisement