Advertisement

  • రైతు వేదికలు ప్రపంచంలో ఎక్కడ లేవు ...రైతు వేదిక నా గొప్ప కల.. సీఎం కెసిఆర్

రైతు వేదికలు ప్రపంచంలో ఎక్కడ లేవు ...రైతు వేదిక నా గొప్ప కల.. సీఎం కెసిఆర్

By: Sankar Sat, 31 Oct 2020 2:55 PM

రైతు వేదికలు ప్రపంచంలో ఎక్కడ లేవు ...రైతు వేదిక నా గొప్ప కల.. సీఎం కెసిఆర్


తెలంగాణ సీఎం కెసిఆర్ జనగామ జిల్లాలో పర్యటిస్తున్నారు..జ‌న‌గామ జిల్లా కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. రైతు వేదిక‌ను ప్రారంభించ‌డంతో ఈ రోజు నాకు సంతోషంగా ఉంది.

మేడ్చ‌ల్‌లో కొత్త చ‌రిత్ర‌కు శ్రీకారం చుట్టాం. కొడ‌కండ్లలో మ‌రో చ‌రిత్ర‌కు శ్రీకారం చుట్టాం. భార‌త‌దేశంలో ఎక్క‌డా లేని విధంగా రైతు వేదిక‌ల‌ను తెలంగాణ‌లో ఏర్పాటు చేశాం. ప్ర‌పంచంలో కూడా రైతు వేదిక‌లు లేవు. అమెరికా, యూర‌ప్ దేశాల్లో కూడా రైతులు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తూనే ఉంటారు. ట‌న్నుల కొద్ది ట‌మాటాలు, ఆలుగ‌డ్డ‌లు ప‌డేస్తనే ఉంటారు. రైతు పెద్ద‌వాడు అనేది విన‌డానికి బాగానే ఉంది. రైతులు కూర్చోవ‌డానికి వేదిక‌లు లేవు.

రైతు వేదిక నా గొప్ప క‌ల.. రైతాంగం ఒక‌చోట కూర్చొని మాట్లాడుకోవాలి. నియంత్రిత సాగుపై మాట్లాడిన‌ట్లే చ‌ర్చ చేయాలి. రైతు వేదిక ఒక ఆటం బాంబు, ఒక శ‌క్తి అని పేర్కొన్నారు. రైతులంద‌రూ సంఘ‌టితంగా మారాలి. రైతు వేదిక‌లు నిజ‌మైన రైతు వేదిక‌లు కావాలి. రైతులంద‌రూ వేదిక‌ల్లో కూర్చొని ఏ పంట వేయాల‌ని నిర్ణ‌యించాలి. మ‌ద్ద‌తు ధ‌ర‌ను కూడా నిర్ణ‌యించాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.


Tags :
|

Advertisement