Advertisement

  • నేటినుంచి తెలంగాణాలో రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం ..

నేటినుంచి తెలంగాణాలో రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం ..

By: Sankar Mon, 28 Dec 2020 1:49 PM

నేటినుంచి తెలంగాణాలో రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం ..


యాసంగి సీజన్‌ ‘రైతుబంధు’ పెట్టుబడి సాయం సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 61.49 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి అందిస్తామని వెల్లడించారు. ఎకరానికి ఐదువేల చొప్పున 1.52 కోట్ల ఎకరాల సాగుభూమికి సోమవారం నుంచి 10 రోజులపాటు జమ చేయనున్నామని, ఇందుకోసం రూ.7,515 కోట్ల బడ్జెట్‌ కేటాయించామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకూ ప్రతి గుంట భూమికీ సాయమందాలని అధికారులను ఆదేశించారు.

రాష్ర్టవ్యాప్తంగా రైతువేదికల నిర్మాణం జరుగుతున్నది. ఈ వేదికల్లో రైతులు, వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు సమావేశమై స్థానిక పరిస్థితులు, మార్కెట్‌కు అనుగుణంగా ఏ పంటలు వేయాలనేదానిపై నిర్ణయించుకోవాలి. మద్దతు ధర వచ్చేలా అనువైన వ్యూహం రూపొందించుకోవాలి. రాష్ర్టవ్యాప్తంగా ఏ రైతు.. ఏ పంట వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇవ్వకపోవడమే మంచిది. నియంత్రిత సాగు విధానం అవసరం లేదు అని సీఎం అన్నారు

Tags :
|

Advertisement